ఏపీలో గ్రామస్థాయిలో వివిధ పనులకు వాలంటీర్లు సేవలు (Voluteer Services) అందిస్తున్నారు. పింఛన్ల పంపిణీలో వారు తెల్లవారక ముందే ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు అందిస్తున్నారు. కానీ అందులో కొందరు మాత్రం తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వృద్దుల బలహీనతను, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని వారిని ముంచేస్తున్నారు. ఓ అంథుడి పింఛన్ 70 వేల రూపాయలను నొక్కేశాడో వాలంటీర్. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా పామూరు 3వ సచివాలయం పరిధిలోని దివ్యాంగుడు షేక్ మస్తాన్ భాషా(37) కు 2020లో దివ్యాంగ పెన్షన్ మంజూరైంది.
అయితే అప్పటి నుంచి వాలంటీర్ వెంకటకృష్ణ అతని నుంచి వేలిముద్రలు (Finger Prints) సేకరిస్తూ అతనికి చెందిన 30 నెలల పింఛన్ అతనికి ఇవ్వకుండా ఇతనే స్వాహా చేస్తూ మోసం చేశాడు. అనుమానం వచ్చి ఆరా తీయగా ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు ఎవరికైనా చెప్తే అతని తల్లికి వస్తున్న పింఛన్ కూడా తీసివేస్తానని బెదిరించసాగాడు. ఈ విషయం మస్తాన్ బాషా బంధువులకు తెలియడంతో విచారించగా వాలంటీర్ చేసిన మోసం బయట పడింది.
Read ALso: Prabhas: ఆ సర్జరీ ఎఫెక్ట్.. సరిగ్గా నిలబడలేకపోతున్న ప్రభాస్..?
తనకు మంజూరైన దివ్యాంగ పింఛన్ వాలంటీర్ కాజేసి తనని మోసం చేయడం దారుణమని దివ్యాంగుడు వాపోయారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మతిస్థిమితం లేని భార్యా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు గా తెలుస్తోంది. కాగా ఉన్న 7 ఏళ్ల పాపతో తన తల్లికి వచ్చే పింఛన్ వారికి జీవనధారం. అలాంటి పేద కుటుంబాన్ని వాలంటీర్ మోసం చేయడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేశారు. వాలంటీర్ పై చర్యలు తీసుకుని పింఛన్ తిరిగి ఇప్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Read Also: Uppal Stadium: క్లబ్ కమిటీ సమావేశంలో ట్విస్ట్.. అజార్ వల్లే సమస్యలు