Putin: రష్యా అధినేత పుతిన్‌ని విమర్శించిన సీనియర్ మిలిటరీ జనరల్ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. లెఫ్టినెంట్ జనరల్ స్విరిడోవ్, స్టావ్‌రోపోల్ ప్రాంతంలోని అతని ఇంటిలో చనిపోయినట్లు రష్యన్ మీడియా తెలియజేసింది. 6వ వైమానికదళం, ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వ్లాదిమిర్ స్విరిడోవ్ మృతదేహాన్ని బుధవారం కనుగొన్నారు. ఇతని శవం పక్కనే ఒక మహిళ శవం పడిఉన్నట్లు పోలీసులు తెలిపారు.