Modi Putin One Frame Images: రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమానాశ్రయంలో పుతిన్‌కు ఘన స్వాగతం పలికారు. నాలుగు సంవత్సరాల తర్వాత పుతిన్ భారత పర్యటనకు వచ్చారు.
Modi-putin: రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరికాసేపట్లో భారత్‌లో ల్యాండ్ కాబోతున్నారు. డిసెంబర్ 4-5 తేదీల్లో ఆయన భారత్ పర్యటించనున్నారు. ఇప్పటికే, భారత ప్రభుత్వం పర్యటన కోసం అత్యున్నత ఏర్పాట్లను చేసింది. పుతిన్ రాకతో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పుతిన్ బస చేసే హోటల్, సందర్శించే ప్రాంతాలను భారత భద్రతా అధికారులతో పాటు రష్యన్ సెక్యూరిటీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Modi – Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ రోజు (డిసెంబర్ 4) భారతదేశ పర్యటనకు రాబోతున్నారు. దేశమే కాకుండా, ప్రపంచం మొత్తం కూడా ప్రధాని నరేంద్రమోడీ, పుతిన్ భేటీపై ఆసక్తి కనబరుస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ తొలిసారిగా భారత్ రాబోతున్నారు. భారత్, రష్యాల మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చలు, సంతకాలు జరిగే అవకాశ ఉంది. ముఖ్యంగా చమురు, రక్షణ, వాణిజ్యంపై రెండు దేశాలు చర్చించనున్నాయి. వీటితో పాటు బ్రహ్మోస్, ఎస్-400,…
Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ రోజు(డిసెంబర్ 4)న తన రెండు రోజుల పర్యటన కోసం భారత్ వస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా అధ్యక్షుడు భారత్ రావడం ఇదే తొలిసారి. దీంతో ఈ పర్యటనకు దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అయితే, ఇప్పుడు పుతిన్ బస చేయబోతున్న ఐటీసీ మౌర్య హోటల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పుతిన్ ఈ విలాసవంతమైన హోటల్‌లోనే బస చేయబోతున్నారు. ఇప్పటికే, రష్యన్…
Vladimir Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొద్ది గంటల్లో భారత్ భూమిపై దిగబోతున్నారు. ఆయన ఓ ప్రత్యేక విమానంలో భారత్‌కు రానున్నారు. పుతిన్ ప్రయాణిస్తున్న స్పెషల్ విమానం IL-96-3000 PUE ను ‘ఆకాశంలో ఎగిరే కోట’ అని అంటారు. ఈ విమానం మీద మిసైల్స్ సైతం ప్రభావం చూపలేవు. పుతిన్ భద్రత అత్యంత హైటెక్ గా ఉంటుంది. పుతిన్ తల నుంచి పాదాల వరకు ప్రత్యేక దుస్తులు, భద్రత పరికరాలు ధరిస్తారు.
Vladimir Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేక విమానం కొన్ని గంటల్లో భారతదేశంలో ల్యాండ్ అవుతుంది. భారతదేశం-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పుతిన్ భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. ఆయన 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. భారత గడ్డపై దిగిన తర్వాత.. పుతిన్ ప్రత్యేక భద్రతా కవచంలో ఉంటారు. భారీ భద్రత మధ్య పుతిన్ రెండు రోజుల పర్యటన కొనసాగనుంది.
Russian President Vladimir Putin will visit India on December: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీలలో భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. పుతిన్ పర్యటన కోసం భారతదేశంలో సన్నాహాలు జరుగుతున్నాయి. రష్యా సైనిక బృందం చాలా రోజుల క్రితం వచ్చి భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తోంది. అయితే.. ఇంతలో ఓ ఆసక్తికర విషయం బయటపడింది. గత 10 సంవత్సరాలుగా పుతిన్ భారత్ సందర్శించిన తీరు ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. పదేళ్లలో పుతిన్ ప్రతి పర్యటన ఏడాది…
S-400: పాకిస్తాన్, చైనా దేశాలకు చేదు వార్త. భారత్ రక్షణ దళాలు రష్యాకు బయలుదేరాయి. ఎందుకంటే, ప్రపంచంలోనే అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌లో ఒకటైన S-400 వైమానిక రక్షణ వ్యవస్థలపై అధునాతన శిక్షణ తీసుకోవడానికి మన సైనికులు పెద్ద సంఖ్యలో రష్యాకు వెళ్లారు.
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారు అయినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 5-6 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించే అవకాశం ఉంది. రష్యా చమురు కొనుగోలుపై అమెరికా భారత్‌పై సుంకాలు విధించిన తర్వాత, రష్యా-భారత్ సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయి. ఈ నేపథ్యంతో పుతిన్ పర్యటనలో ఇరు దేశాల మధ్య మరిన్ని ఒప్పందాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.
Putin To Visit India: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్ సందర్శిస్తారని క్రెమ్లిన్ ఈ రోజు తెలిపింది. మాస్కో-న్యూఢిల్లీలు షెడ్యూల్ ఖరారు చేసేందుకు పనిచేస్తున్నట్లు వెల్లడించింది. పుతిన్ తన పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీని కలవనున్నారు. అక్టోబర్ చివరలో బ్రిక్స్ సదస్సులో ఇరువురు నేతలు కలిశారు. ఈ పర్యటన సందర్భంగా పుతిన్‌ని భారత్‌లో పర్యటించాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానం పంపారు.