ఆంధ్రప్రదేశ్ లో పండిన మామిడి పండ్లను ఉత్తర భారతదేశానికి తీసుకెళ్లేందుకు వీలుగా వాల్తేర్ రైల్వే డివిజన్ ‘ మ్యాంగో ఎక్స్ ప్రెస్’ని ప్రారంభించింది. అయితే ఈ సీజన్ లో మాత్రం మ్యాంగో ఎక్స్ ప్రెస్ లేనట్టే. స్థానిక మార్కెట్ లో మంచి ధర పలుకుతుండటంతో వ్యాపారులు కూడా తమకు ఇబ్బందులు లేవని చెబుతున్నారు. అయితే బొగ్గు తరలింపుకు ప్రాముఖ్యత ఇచ్చిన రైల్వే శాఖ విజయనగరం నుంచి న్యూ ఢిల్లీ వెళ్లే మ్యాంగో ఎక్స్ ప్రెస్ రైలు సర్వీస్…
పార్వతీపురం జిల్లా వైసీపీ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి .. టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు.. తాను అవినీతి చేశాను అని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని పేర్కొన్నారు
రాష్ట్రంలో సామాజిక న్యాయానికి ఆద్యుడు స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. విజయనగరంలో ఆయన చీపురుపల్లిలో మాట్లాడుతూ. రాష్ట్రంలో విధ్వంస పాలన జరుగుతుంది…రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయింది. ప్రభుత్వం చెప్పిన నాడు నేడు ఏమయ్యింది. పదో తరగతిలో ఎందుకు అంతమంది ఫెయిల్ అయ్యారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా తెస్తాం అని జగన్ అన్నారు… ఇప్పుడు మెడలు వంచారు… కాళ్ల బేరానికి వచ్చారని దుయ్యబట్టారు. జగన్ హోదా విషయంలో మెడలు వంచారు. జగన్ చర్యలకు…
ఏపీలో ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేస్తుందన్నారు విజయనగరం జెడ్పీ ఛైర్మన్ మజ్జి చిన్ని శ్రీనివాస రావు. రహదారులు పాడైపోయాయి.. అభివృద్ధి చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నారు. ముఖ్యంగా విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో పలు కార్యక్రమం చేపట్టామన్నారు. మా ప్రజాప్రతినిధులు పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. జిల్లాలో పలు గ్రామాలలో రోడ్డు బాగోలేవన్నది ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. 426 కిలో మీటర్ల పరిధిలో రోడ్లు 127 కోట్లతో వేయబోతున్నాం. టెండర్ల ప్రక్రియ పూర్తయింది. పనులు…
ఏపీలో జగన్ పాలనపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. రోజూ మామూలుగా మారిన అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలపై టీడీపీ మండిపడుతోంది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏపీ అథఃపాతాళానికి వెళ్ళిపోయిందన్నారు టీడీపీ అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీ విషయంలో మాట్లాడిన అంశాలపై ఆయన మాట్లాడారు. ఏపీలో అధ్వాన్న పరిస్థితిపై మాట్లాడితే వైసీపీ దొంగల ముఠా విరుచుకుపడింది. పక్క రాష్ట్రాల సీఎంలు ఒక్కసారి ఏపీకి రండి. సొంత ఖర్చులు పెట్టి తీసుకొస్తాం. ఏపీని జగన్మోహన్ రెడ్డి…
ఆంధ్రప్రదేశ్ లో అడగడుగునా అత్యాచారాలు, వేధింపులు. అసలు శాంతిభద్రతలు వున్నాయా అనే అనుమానం కలుగుతోందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఏపీలో నేరాలపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. విజయవాడ, దుగ్గిరాల, రేపల్లె.. తాజాగా విజయనగరంలో మహిళలపై దారుణ అత్యాచారాలు అందరినీ కలిచివేస్తున్నాయి. మీలో చలనం రావాలంటే ఇంకెంత మంది ఆడబిడ్డలు బలవ్వాలి జగన్ గారు? అంటూ టీడీపీ నేత నారా లోకేష్ ప్రశ్నించారు. విజయనగరం జిల్లాలో అర్థరాత్రి ఘోరం జరిగినా సీఎం జగన్ మనస్సు కరగదా? అన్నారు. మహిళా…
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా.మన్ షుఖ్ మాండవీయ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రభుత్వ పథకాలు, వివిధ కార్యక్రమాల అమలును పరిశీలించనున్నారు కేంద్ర మంత్రి మాండవీయ. గుంకళాంలో ఇళ్ల నిర్మాణం, గొట్లాంలో నాడు- నేడు కార్యక్రమంలో నవీకరించిన పాఠశాలను, కుమిలిలో రైతు భరోసా కేంద్రాన్ని, ఎం.డి.యు. నిత్యావసర సరుకుల పంపిణీ వాహనాన్ని పరిశీలించనున్నారు కేంద్ర మంత్రి. అలాగే, జిల్లా కేంద్ర ఆసుపత్రిని, రామతీర్థంలో ఆలయాన్ని సందర్శించనున్నారు కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ. దేశంలో…