ఆంధ్ర ఒడిశా సరిహద్దు గ్రామాల గిరిజనులు ఎమ్మెల్యే రాజన్నదొరను కలిశారు. కొఠియా గ్రూపు గ్రామాలలో తెలుగు బోర్డులు ఏర్పాటు చేస్తుండగా ఒడిశా అధికారులు అడ్డుకుని తమపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు. ఒడిశాతో ఉండకపోతే కేసులు పెట్టి జైలుపాలు చేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మా ధన మాన ప్రాణరక్షణకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేను వారు కోరారు. అలాగే ఐటిడిఎ పిఓ , జిల్లా కలెక్టర్లకు కూడా ఫిర్యాదు చేస్తామని గిరిజనులు తెలిపారు. కొఠియా సమస్యపై చీఫ్…
నిషేధిత గుట్కా, ఖైనీలను కేటుగాళ్ళు వివిధ మార్గాలలో తరలిస్తున్నారు. పోలీసుల కళ్ళు గప్పి లారీల్లో ఎక్కించి సరిహద్దులు దాటించేస్తున్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం బూర్జీవలస సమీపంలో లారీని తనిఖీ చేసిన పోలీసులు అవాక్కయ్యారు. లారీలో అక్రమంగా తరలిస్తున్న లక్షల విలువైన నిషేధిత ఖైనా , గుట్కా లను భూర్జివలస పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జీడిపిక్కలు పొట్టు (తొక్కలు)మాటున లారీలో తరలిస్తున్న ఖైనీ, గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు పోలీసులు. ఒడిశా నుండి భూర్జివలస మీదుగా విశాఖపట్నం తరలిస్తుండగా…
ఈజీమనీకి అలవాటుపడిన జనం కష్టపడకుండా ఇతరుల్ని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు. విజయనగరం జిల్లాలో దొంగనోట్లను చలామణీ చేస్తున్న ముఠా గుట్టుని రట్టుచేశారు బొబ్బిలి పోలీసులు. గొర్రెల కాపరి ఫిర్యాదు మేరకు దొంగనోట్ల ముఠాను పట్టుకున్నారు. కొద్ది రోజులు క్రితం బలిజిపేట సంతలో రూ.11,500 లకి గొర్రెలను అమ్మారు బొబ్బిలి మండలం శివడావలస గ్రామానికి చెందిన జాడ సోములు. రూ.11,500 లో రూ. 10 వేల దొంగనోట్లు ఇచ్చారు ఐదుగురు ముఠా సభ్యులు. 10 వేలును వేరొక…
ఇంట్లో ఒంటరిగా రెండు మూడు రోజులు ఉండాలంటేనే భయపడిపోతాం. అలాంటిది అడవిలో ఎవరూ తోడు లేకుండా నివశించాలంటే ఇంకేమైనా ఉన్నదా? ఎటు నుంచి ఏ పాము వస్తుందో, కౄరమృగం వచ్చి చంపేస్తుందో అని భయపడిపోతుంటాం. కాని, ఆమె అలా భయపడలేదు. ఒకటి కాదు రెండు కాదు 70సంవత్సరాల నుంచి అడవిలో ఒంటరిగా నివశిస్తోంది. విజయనగరం జిల్లాలోని గజపతి నగరం మండలంలోని పెదకాద అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి సమీపంలో ఓ అడవి ఉన్నది. ఆ అడవిలో…
విజయనగరంలో ఓ మహిళా ఎస్సై ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారింది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సఖినేటిపల్లి మహిళా అడిషనల్ ఎస్సై కె.భవానీ విజయనగరంలో ఆత్మహత్య చేసుకున్నారు.. ఆమె స్వస్థలం కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెం గ్రామంగా చెబుతున్నారు అధికారులు… 2018 బ్యాచ్‌కి చెందిన ఎస్సై భవానీ అవివాహితురాలు.. అయితే, వారం రోజుల క్రితం విజయనగరం జిల్లాలో పీటీసీ ట్రైనింగ్ నిమిత్తం వెళ్లి వచ్చారామె… కానీ, ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి అనేది మాత్రం తెలియాల్సి…
మాన్సాస్ ట్రస్ట్ వివాదంలో రోజుకో కొత్త ట్విస్ట్ అనే తరహాలో కొత్త మలుపులు తిరుగుతూనే ఉంది… తాజా గా ఆనంద గజపతిరాజు రెండో భార్య కుమార్తె ఊర్మిళ గజపతి రాజు తనను ఛైర్మన్‌గా నియమించాలంటున్నారు.. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు ఊర్మిళ.. మొదటి భార్య కుమార్తె సంచయితను ఇటీవలే హైకోర్టు ట్రస్ట్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే కాగా.. తాజాగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం.. ఊర్మిళను, సంచయితను వారసులుగా గుర్తించినట్లు కోర్టుకు తెలిపారు…
విజయనగరం రురల్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. వాహనాల తనిఖీ నేపధ్యంలో విజయనగరం ఏజెన్సీ నుంచి విశాఖ వైపు వెళ్తున్న వాహనం పై అనుమానంతో తనిఖీ చేపట్టారు పోలీసులు. అందులో అల్లం మాటున గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. వాహనంలో అల్లం కాకుండా 3 వేల కేజీల గంజాయిని గుర్తించారు పోలీసులు. దొరికిన గంజాయి విలువ 1.50 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. దాంతో ఆ వాహనం తో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నటు వెల్లడించారు ఎస్పీ…
ఎప్పుడో ఐదేళ్ల క్రితం ఓ యువతి ఇంటి నుంచి బయటకు వచ్చి తప్పిపోయింది. తప్పిపోయిన యువతి కోసం తల్లిదండ్రులు పోలిస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కానీ, ఉపయోగం లేకుండా పోయింది. అయితే, అలా తప్పిపోయి యువతి ఐదేళ్ల తరువాత తిరిగి ఇంటికి వస్తున్నట్టు తల్లిదండ్రులకు సమాచారం అందింది. ఈ సంఘటన విజయనగరం జిల్లాలోని గుమ్మల లక్షీపురం మండలంలోని టిక్కబాయి గ్రామానికి చెందిన జయసుధ అనే యువతి మతిస్థిమితం లేక పుదుచ్చెరి వేళ్లే రైలు ఎక్కి వెళ్లిపోయింది. రైల్వే…
యాస్ తుఫాన్ నేపథ్యంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం వైఎస్ జగన్… వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.. తుఫాన్ కదలికలను ఎప్పటికప్పుడు చూసుకుంటూ అవసరమైన చర్యలను తీసుకోవాలన్న సీఎం.. అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.. ఇక, శ్రీకాకుళం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎస్ ఆదిత్యనాథ్ దాస్.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిస్థితులను వివరించారు.. శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడా జల్లులు తప్ప ప్రస్తుతానికి పెద్దగా ప్రభావం…