బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసిన ఉగ్రవాదులు సిరాజ్, సమీర్‌లను విజయనగరం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వారిద్దరినీ 7 రోజుల కస్టడీకి ఇస్తూ గురువారం సాయంత్రమే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలిచ్చింది. వారిద్దరూ విశాఖపట్నం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.