జగన్ కోసం, వైసీపీ కోసం ప్రజాస్వామ్యం లేదు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ ఎంపీ కుటుంబాన్ని రౌడీషీటర్లు కిడ్నాప్ చేయడానికి సిరిపురంలో ఉన్న భూముల వ్యవహారమే కారణం అని ఆయన ఆరోపించారు.
పరిపాలనా రాజధానిగా వైజాగ్ ను సీఎం జగన్ ప్రకటించినప్పటి నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విషం చిమ్ముతున్నారు అని మంత్రి రోజా ఆరోపించారు. వైజాగ్ ను క్రైం సీటిగా పవన్, చంద్రబాబు చిత్రీకరిస్తున్నారు.. రిషికోండకు బోడిగుండు కోట్టించారంటూ బోడి యదవలందరూ బోడి ప్రచారం చేస్తున్నారు అని ఆమె విమర్శించారు.