EVM Ganpati : ఈవీఎం గణపతి.. ఓటర్ ఐడీలు పట్టుకుని క్యూ కట్టిన మూషికాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EVM Ganpati : తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వినాయక ఉత్సవాల్లో మునిగిపోయారు భక్తులు.. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఇంటిల్లిపాది గణేష్ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.. ఇంట్లో.. గల్లీలో.. వీధిలో.. ఊరులో.. వాడలో ఇలా పల్లె, పట్టణం, నగరం తేడా లేకుండా ఘనంగా వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో విభిన్న రీతుల్లో దర్శనం ఇస్తున్నారు వినాయకులు.. విశాఖలో ఈసారి విభిన్న వినాయకులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.. ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేస్తూ విశాఖలోని తాటి చెట్ల పాలెం లో ఈవీఎం వినాయకుడు కాన్సెప్ట్ భక్తులను విపరీతంగా ఆకర్షిస్తుంది..
ఓటు హక్కుకు ఉన్న ప్రాధాన్యత తెలిజేసేలా.. ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రోత్సహించేలా.. పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి ఎలక్షన్ ను నిర్వహించారు యువసేన ఫౌండేషన్.. మూసికాలను ఓటర్లుగా నిలబెట్టి స్వతంత్ర అభ్యర్థి వినాయకుడే లోకనాయకుడు అనే నినాదంతో వినాయక చవితి నిర్వహిస్తున్నారు.. ఈ కాన్సెప్ట్ వినాయకుడిని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు.. ఈవీఎం వినాయకుడు కాన్సెప్ట్ తో ఓటు హక్కు ప్రాముఖ్యత, పోలింగ్ స్టేషన్ ఎలక్షన్ జరుగు విధానాన్ని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బొజ్జ గణపయ్యని భక్తుల ముందుకు తీసుకు వచ్చిన భక్తుడు యువసేవ ఫౌండేషన్ పీలా హరిప్రసాద్‌గా చెబుతున్నారు.. మొత్తంగా ఎన్నికలకు ముందు వచ్చిన వినాయక చవితిని పురస్కరించుకుని ఓటర్లను చైతన్యం కలిగించేలా తీసుకొచ్చిన ఈ కాన్సెఫ్ట్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.
Also Read
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Punganur Clashes: పుంగనూరు ఘటనపై మూడు కేసులు నమోదు.. డీఐజీ కీలక వ్యాఖ్యలు
- MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
- Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
మరోవైపు అనకాపల్లి జిల్లా, యలమంచిలి.. ఏటికొప్పక గ్రామంలో వినాయక చవితి సందర్భంగా లక్క బొమ్మలు తయారుచేసే చింతల లావణ్య ఒక అంగుళం ఎత్తు పరిమాణంలో ఒక వినాయకుడిని తయారు చేశారు. ఈ బొమ్మ తయారు చేయడానికి రెండు రోజులు పట్టిందని చెబుతున్నారు.. ఈ బొమ్మ తయారీలో అంకుడు చెక్కను మరియు ప్రకృతి రంగులను ఉపయోగించారు. ఏటికొప్పాక లక్క బొమ్మల తయారీలో మగ వారి లాగానే మహిళలు కూడా ఈ బొమ్మల తయారీలో నైపుణ్యం సంపాదించాలనే ఉద్దేశంతో ఈమె 150 మంది మహిళలకు శిక్షణ ఇస్తున్నారు.

తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
-
India Squad for New Zealand Series: న్యూజిలాండ్తో వన్డే, టెస్ట్ సిరీస్ల కోసం భారత జట్ల ప్రకటన.. జడేజాకు షాక్!
-
Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
-
El Nino: ఎల్నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్లు
-
Punganur Clashes: పుంగనూరు ఘటనపై మూడు కేసులు నమోదు.. డీఐజీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!