Riti Saha Case: విద్యార్థిని రీతి సాహ కేసులో కొత్త ట్విస్ట్.. ఏపీ కోర్టుకు తండ్రి సుఖదేవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Riti Saha Case: విశాఖలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని రీతి సాహ కేసు రోజుకో మలుపు తీసుకుంటుంది.. జులై 14వ తేదీన భవనంపై నుంచి కిందపడి రీతి సాహ ప్రాణాలు కోల్పోయింది. నీట్ శిక్షణ కోసం కోల్‌కత్తా నుంచి విశాఖ వచ్చి చదువుకుంటున్న రీతి సాహా వ్యవహారం ఇప్పుడు మిస్టరీగా మారింది. అయితే, కేసు దర్యాప్తును స్థానిక పోలీసులు తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ విద్యార్ధిని తల్లిదండ్రులు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఫిర్యాదు చేయడంతో అక్కడి పోలీసులు కేసులు నమోదు చేశారు. విద్యార్దిని ఆత్మహత్య వ్యవహారంలో ఏపీ పోలీసుల వైఖరిపై విద్యార్ధిని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేయడం, బెంగాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో కేసు సంచలనంగా మారింది..
ఇక, రీతి సాహ కేసులో తాజాగా కొత్తట్విస్ట్ తెరపైకి వచ్చింది. విద్యార్థిని రీతి సాహ ఆసుపత్రిలో ఉన్న వీడియో బయటపడింది. హాస్టల్ బిల్డింగ్ నుంచి కిందపడిన తర్వాత బాలికను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చింది యాజమాన్యం. దీంతో బాలిక తల్లిదండ్రుల ఆరోపణలకు రోజు రోజుకి బలం చేకూరినట్టు అవుతుంది.. రీతి సాహా అత్మహత్య కేసులో బెంగాల్ ప్రభుత్వం ఒత్తిడితో దర్యాప్తు అధికారులపై ఇప్పటికే వేటు పడింది. సీఐ, ఎస్సైలను ఏపీ ప్రభుత్వం వీఆర్‌కు పంపింది.. మరోవైపు.. తాజాగా మరో మలుపు తీసుకుంది ఈ కేసు.. రీతి సాహ కేసుపై ఏపీ హైకోర్టును ఆశ్రయించారు ఆమె తండ్రి సుఖ దేవ్.. సీసీ టీవీ ఫుటేజ్ సేకరణ కోసం ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
- AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
- India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
జులై 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సాధన హాస్టల్, 14, 15 తేదీల్లో వెంకట రామా హాస్పిటల్ లో సీసీ ఫుటేజ్ సేకరించాలని పిటిషన్‌లో కోరారు రీతి సాహ తండ్రి.. ఈ సీసీ టీవీ ఫుటేజ్ లను తారు మారు చేయటం, నాశనం చేసే అవకాశాలు ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్న ఆయన.. విచారించి అడ్వకేట్ కమిషనర్‌ను ఏర్పాటు చేసింది హైకోర్టు.. అడ్వకేట్ కమిషనర్ విశాఖ వెళ్లి సీసీ టీవీ ఫుటేజ్ పై రిపోర్టును ఆగస్టు 28న హైకోర్టుకు అందజేశారు. ఇక, ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా వేసింది. పిటిషన్‌లో ప్రతివాదులుగా విశాఖ సీపీ, విశాఖ ఫోర్త్ టౌన్ పోలీసులు, సాధన హాస్టల్, వెంకట రామ ఆసుపత్రి, కేర్ ఆసుపత్రిని చేర్చారు. కాగా, బెంగాల్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని రీతి సాహ మృతి కేసు ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారుతోంది.
తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..