విశాఖ టూర్ లో బిజీగా వున్నారు ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు. డాబాగార్డెన్స్ లోని ప్రేమ సమాజంలో 90వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ప్రేమ సమాజం సావనీర్ ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి ప్రేమ సమాజంతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మానవ సేవ మాధవ సేవ..కష్టాలలో ఉన్నవారికి చేయూత నివ్వట౦ భారతదేశ స౦స్క్రతిలోనే అంతర్భాగంగా ఉందన్నారు. నేను చదువుకునే రోజులలో ప్రేమ సమాజం చేపట్టే కార్యక్రమాలలో పాల్గొన్నాను. కుల మత వర్గ బేధాలు…
ఏపీ సీఎం జగన్ విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. చిన ముషిడివాడలోని శారదాపీఠం నిర్వహిస్తున్న వార్షికోత్సవాలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజశ్యామల యాగం కోసం ముఖ్యమంత్రితో పండితులు సంకల్పం చేయించారు. అనంతరం అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జగన్ చేతుల మీదుగా కలశ స్థాపన చేయించారు. రాజశ్యామల యాగంలో జగన్ తో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆయన భార్య స్వర్ణమ్మ పాల్గొన్నారు. స్వామివారు జగన్ ని ఆశీర్వదించారు.
యువత రాణిస్తేనే దేశాభివృద్ధి జరుగుతుందన్నారు వెస్ట్ బెంగాల్ డీజీపీ BN రమేష్. విశాఖలో పర్యటిస్తున్న రమేష్ నగరంలో పలు విద్యా సంస్థలను సందర్శించి విద్యార్ధులతో నేరుగా ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థుల్లో దేశ భక్తి పెంపొందింప చేసేలా ఉపన్యాసం ఇచ్చారు. విద్యార్థులలో దేశభక్తి పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. యువత, విద్యార్థులు దేశానికి వెన్నెముక వంటి వారన్నారు రమేష్. విద్యార్థి దశ చాలా కీలకం అన్నారు. ప్రతీ ఒక్కరు దేశ సేవలో పాల్గొనాలని, దేశరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. దేశ…
ఒకవైపు రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్న వేళ.. ఈనెల 23 వ తేదీన విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 23 వ తేదీ మధ్యాహ్నం 3:30 నిమిషాలకు ముఖ్యమంత్రి జగన్ తన నివాసం నుంచి బయలుదేరి 4:45 నిమిషాలకు విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు. విశాఖలో పలు కార్యక్రమాలతో పాటు ఓ వివాహానికి హాజరవుతారు. ఎయిర్ పోర్ట్ నుంచి 5:20 నిమిషాలకు ఎన్ఏడి కి చేరుకొని అక్కడ నిర్మించిన ఫ్లై ఓవర్…