శుక్రవారం విశాఖలో సీఎం జగన్ పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాహనమిత్ర లబ్ధిదారులకు నాలుగవ విడత సహాయాన్ని ముఖ్యమంత్రి విడుదల చెయ్యనున్నారు. బహిరంగ సభ నిర్వహణ కోసం ఆంధ్రాయూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ సిద్ధం అయింది. మరో వైపు, మున్సిపల్ కార్మికుల సమ్మె, స్కూళ్ళ విలీనం, స్టీల్ ప్లాంట్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని సీఎం టూర్ కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు జరిగాయి.
Taneti Vanitha: 46 ముంపు మండలాల్లో సహాయక చర్యలు
ఆటోడ్రైవర్లు, క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ ఓనర్లకు ఏటా ప్రభుత్వం వాహనమిత్ర సహాయం అందజేస్తోంది. మరమ్మత్తులు, ఇన్స్యూరెన్సుల చెల్లింపుల కోసం అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి పదివేల రూపాయలను నగదు బదిలీ చేస్తోంది. గడచిన మూడేళ్ళుగా నిరాటంకంగా సహాయం అందించిన ప్రభుత్వం…నాలుగ విడత పంపిణీ కార్యక్రమానికి విశాఖను వేదికగా ఎంచుకుంది. రెండు లక్షల 61వేల మందికి పైగా లబ్ధిదారులు వుండగా వీరికి రెందు వందల 61కోట్ల రూపాయలను అందించనుంది. రాష్ట్రస్థాయి వాహన మిత్ర బహిరంగ నిర్వహ ణ కోసం ఆంధ్రాయూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో భారీ ఏర్పాట్లు జరిగాయి. 30వేల మందికి తక్కువ కాకుండా కూర్చునేందుకు సన్నాహాలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధం అయ్యాయి. పార్టీ జెండాలు, ఫ్లైక్సీలతో విశాఖ సాగరతీరం కలర్ ఫుల్ గా మారింది.
సీఎం జగన్మోహన్ రెడ్డి దాదాపు రెండు గంటల సేపు నగరంలో వుండనున్నారు. వాహనమి త్ర సభ విజయవంతం కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వివిధ ప్రాం తాల్లో వున్న లబ్ధిదారులను నగరానికి తీసుకుని వచ్చేందుకు బస్సులను ఏర్పాటు చేసింది. మరోవైపు, డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మి కులు ఐదురోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. వీరికి వివిధ కార్మిక సంఘాల మద్దతు లభిస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ఐక్యకార్యాచరణ ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు, స్కూళ్ళ విలీనాన్ని విద్యార్ధి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ద్ర్రష్టికి సమస్యల తీవ్రతను తీసుకుని వెళ్ళేందుకు సిద్ధమని ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి పర్యటనకు భద్రతాపరంగా కట్టుదిట్టమైన చర్యలను పోలీసుశాఖ తీసుకుంది.
Lal Singh Chadda: చిరు, నాగ్, రాజమౌళి, సుకుమార్ కు ‘లాల్ సింగ్ చద్దా’ ప్రివ్యూ