విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తెలంగాణ సర్కారు మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉంది. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొననుంది. ఈ మేరకు కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించొద్దంటూ కార్మికులు ఓ వైపు ఉద్యమాలు చేస్తుండగానే కేంద్రం మాత్రం దానిని విక్రయించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ మరో ముందడుగు వేసింది. రైలు చక్రాలు తయారీలో విశాఖ స్టీల్స్ తొలి విడుతగా 51 లోకో వీల్స్ తయారీ చేసింది. లోకో వీల్స్ తయారీ కోసం రూ. 1700 కోట్లతో లాల్ గంజ్, రాయబరేలీలో ప్రత్యేక యూనిట్‌ని నెలకొల్పింది. లాల్ గంజ్ నుంచి తొలిసారిగా నిన్న రాత్రి 51 లోకో వీల్స్‌ని ఇండియన్ రైల్వే కి వైజాగ్ స్టీల్స్ ఉన్నతాధికారులు పంపించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించనున్నట్లు ప్రకటించిన విషయం…
విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించవద్దని కేంద్రాన్ని వైసీపీ సర్కార్ ప్రశ్నించాలని.. కేంద్రాన్ని అడగకుంటే తప్పు చేసినట్టు అవుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయ పార్టీలు విబేధాలు పక్కన పెట్టి ముందుకు రావాలని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో… వైసీపీ… అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రేపట్నుంచి మూడు రోజుల పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం డిజిటల్ క్యాంపెయిన్ మొదలు పెడుతున్నామని…పేర్కొన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు.. 22 మంది ఎంపీలు…
ఓవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంటే.. మరోవైపు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ సాధించుకున్న స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం కానివ్వం అంటూ కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి.. కార్మికుల ఆందోళనకు బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి.. అయితే, స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై స్పందించిన కన్నా లక్ష్మీనారాయణ.. ప్రభుత్వం పాలన మాత్రమే చేయాలి.. వ్యాపారం చెయ్యకూడదన్నది ప్రధాని నరేంద్ర మోడీ పాలసీగా చెప్పుకొచ్చారు.. అందుకే విశాఖ…
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని ఇప్పటికే స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.. అయితే, విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ సాధించుకున్న ఈ పరిశ్రమ ప్రైవేటీకరణకు ఒప్పుకునేది లేదంటున్నాయి అన్ని పార్టీలు.. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేశాయి… విశాఖ నుంచి ఇప్పుడు ఆందోళన ఢిల్లీ వరకు చేరింది… బీజేపీ మినహా అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు.. ఈ ఆందోళనలో పాలుపంచుకుంటున్నాయి.. అయితే, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంపై…
విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం… వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం.. ప్రైవేటీకరణ ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోందని.. ఈ మేరకు ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేసింది.. ఇక, ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదని పేర్కొన్న కేంద్రం.. అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తామని అఫిడవిట్‌లో పేర్కొంది… ఉద్యోగులు ప్లాంటు…
విశాఖ ఉక్కు.. ఆంధ్రల హక్కు అంటూ ఓ వైపు పోరాటం జరుగుతున్నా.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వడివడిగా ముందుకు అడుగులు వేస్తోంది ప్రభుత్వం.. ఈ వ్యవహారంలో అన్ని పార్టీలు కేంద్రంపై విమర్శలు పెంచాయి.. పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం అవుతున్నాయి. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడే హక్కు ఏ పార్టీకిలేదన్నారు.. కేవలం రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసం స్టీల్ ప్లాంట్ పై ప్రేమ చూపిస్తున్నాయని మండిపడ్డారు.…