ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విశాఖపట్నంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ పోటీచేసిన స్థానాల్లో గెలిచి.. టీడీపీ పోటీ చేసిన స్థానాల్లో వారిని గెలిపిస్తే సీఎం పోస్ట్ అడగవచ్చు అన్నారు.. ఇక, మేం టీడీపీ వెనకాల నడవడం లేదు.. టీడీపీతో కలిసి నడుస్తున్నాం అన్నారు.
మోడీ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అభివృధ్ధిపై విశాఖ రైల్వే గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.