Pawan Kalyan: ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విశాఖపట్నంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ పోటీచేసిన స్థానాల్లో గెలిచి.. టీడీపీ పోటీ చేసిన స్థానాల్లో వారిని గెలిపిస్తే సీఎం పోస్ట్ అడగవచ్చు అన్నారు.. ఇక, మేం టీడీపీ వెనకాల నడవడం లేదు.. టీడీపీతో కలిసి నడుస్తున్నాం అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జనసైనికుల ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెట్టబోను.. ఎక్కువ సీట్లు వస్తే సీఎం పదవి అడగవచ్చు అన్నారు.. సీఎం ఎవరనేది చంద్రబాబు, నేను కూర్చొని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు పవన్ కల్యాణ్. అన్నీ ప్రజలకు చెప్పే చేస్తాం.. మీ ఆత్మ గౌరవం ఎప్పుడు తగ్గించను.. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి అలయన్స్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు.
Read Also: Pawan Kalyan: నేను అధికారం కోసం కాదు.. మార్పు కోసం ఓట్లు అడుగుతా..
ఇక, మేం ఎవరికీ బీ పార్టీ కాదు అని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్.. నన్ను నేను తగ్గించునకైనానా.. మిమ్మల్ని పెంచడానికి నేను సిద్ధం అని ప్రకటించారు. ఆడపిల్లల మీద అన్యాయం జరిగితే కాళ్లు, చేతులు తీసేసే బలం మనకు కలగాలి.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మహిళల మీద దాడుల్లో రాష్ట్రం 6వ స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని గెలిపిస్తే పోలీస్ శాఖకు పూర్వ వైభవం తెస్తాం.. శాంతిభద్రతల విషయంలో రాజీపడని అధికారులను నియమిస్తాం అన్నారు. నేను అహంకారంతో ఆలోచించే వాడిని కాదు.. 2024లో ఏపీ భవిష్యత్తు బంగారు మయంచేయాలి.. అది నా లక్ష్యం అని వెల్లడించారు. జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు బలమైన ఓట్లతో గెలిపించగలిగితే మన కోరిక తీరుతుంది.. ఒక్క జనసేన ఎంపీ ఉన్న స్టీల్ ప్లాంట్ గనులు సాధించేవాడిని అన్నారు పవన్ కల్యాణ్.
Read Also: Devil: వివాదాలతోనే ఫేమస్ అయిన సినిమా.. ఎట్టకేలకు రిలీజ్ డేట్ తో వచ్చింది
నేను సక్సెస్ అయినప్పుడు ఎవరు గుర్తు పెట్టు కోరు.. కష్టం వచ్చినప్పుడు పవన్ కల్యాణ్, జనసేన గుర్తుకు వస్తాయి అన్నారు పవన్.. నేను ఓడిపోయిన సమయంలో విశాఖ గుండెలకు హత్తుకుందన్నారు. కానీ, నా సినిమా టిక్కెట్లను నియంత్రణ కోసం రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకునే చిల్లర చేష్టలు చేసింది జగనే అని మండిపడ్డారు. జగన్ కిరాయి గుండాలను ఎదుర్కొనే ధైర్యం వైజాగ్ ఇచ్చింది.. జనసేన, టీడీపీలను గెలిపించండి.. మరో సారి వైసీపీ వైపు చూస్తే నష్టమే అని సూచించారు. జానీ సినిమాలో పాటను హమ్మింగ్ చేసి రాష్ట్రంలో పరిస్థితులకు అన్వయించి చెప్పారు పవన్.. గంజాయి, డ్రగ్స్ తో వేల కోట్లు ఈ పాలకులు వచ్చేశాయి.. రాష్ట్రంలో అవినీతి ప్రజల భవిష్యత్తును నిర్ధేశించే ప్రమాదకర స్థాయికి వెళ్ళిపోయిందన్నారు. ఉత్తరాంధ్ర వైసీపీ విముక్త ప్రాంతంగా ప్రకటిద్దాం.. జనసేన ప్రభుత్వంలో బాధ్యత, అన్ని స్థాయిల్లో అధికారం తీసుకుంటాం.. ఈసారి మార్పు, సుస్థిరత కోసం జనసేన-టీడీపీకి ఓటేయండి. సంక్షేమ కార్యక్రమాలు ఏవీ ఆగిపోవు అని మాట ఇచ్చారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు జనసేన-టీడీపీ తరఫున సానుభూతి తెలిపారు పవన్.