ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో అంధకారం అలముకుంది. దాదాపు 10 గంటల పాటు పేషెంట్లు తీవ్ర అవస్థలు పడ్డారు. బాలింతలు గర్భిణీలు చంటి పిల్లలతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. మొబైల్ వెలుతురులో వైద్యం అందిస్తూ, కొవ్వొత్తుల వెలుగులో విధులు నిర్వహిస్తూ నర్సింగ్ సిబ్బంది కూడా పడరాని పాట్లు పడ్డారు. ఉత్తరాంధ్ర పెద్దాసుపత్రికి గ్రహణం పట్టింది. మధ్యాహ్నం నుంచి విద్యుత్ నిలిచిపోవడంతో రోగులతో కిటకిటలాడే వార్డులన్నీ అంధకారంలో మగ్గిపోయాయి. చిమ్మ చీకటిలో రోగులు అల్లాడిపోయారు. రాజేంద్రప్రసాద్…
విశాఖపట్నం కేజీహెచ్‌లో ఓ మిరాకిల్ చోటు చేసుకుంది. చనిపోయిన శిశువులో కొన్ని గంటల తర్వాత చలనం వచ్చింది. వెంటనే పిల్లల విభాగంలోని ఎన్‌ఐసీయూ (నియోనెటాల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్)కు తరలించిన డాక్టర్లు చికిత్స అందించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. దాంతో చనిపోయాడనుకుని తీవ్ర దుఃఖంలో ఉన్న ఆ శిశువు తండ్రి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వివరాల ప్రకారం… విశాఖపట్నం నగరానికి చెందిన ఓ గర్భిణీ పురుటి నొప్పులతో శుక్రవారం రాత్రి 9 గంటల…