Vizag KGH: విశాఖ కేజీహెచ్‌లో మిరాకిల్.. చనిపోయిన శిశువులో చలనం! ఆనందంలో తండ్రి
- విశాఖ కేజీహెచ్‌లో మిరాకిల్
- చనిపోయిన శిశువులో చలనం
- తండ్రి ఆనందానికి అవధుల్లేవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నం కేజీహెచ్‌లో ఓ మిరాకిల్ చోటు చేసుకుంది. చనిపోయిన శిశువులో కొన్ని గంటల తర్వాత చలనం వచ్చింది. వెంటనే పిల్లల విభాగంలోని ఎన్‌ఐసీయూ (నియోనెటాల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్)కు తరలించిన డాక్టర్లు చికిత్స అందించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. దాంతో చనిపోయాడనుకుని తీవ్ర దుఃఖంలో ఉన్న ఆ శిశువు తండ్రి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
వివరాల ప్రకారం… విశాఖపట్నం నగరానికి చెందిన ఓ గర్భిణీ పురుటి నొప్పులతో శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేరారు. వైద్యులు సిజేరియన్ చేసి.. ప్రసవం చేశారు. మగబిడ్డ జన్మించినప్పటికీ.. బరువు తక్కువగా ఉండడంతో డాక్టర్లు అత్యవసర వైద్య సేవలు అందించారు. ఎనిమిది గంటల పాటు శ్రమించారు. శనివారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో శిశువుకు ఊపిరి ఆడలేదు. వైద్యులు పరిశీలించి ప్రాణం పోయిందని చెప్పడంతో.. కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతం అయ్యారు. శిశువు మృతిచెందినట్టు ఆసుపత్రి రికార్డ్స్ లో సిబ్బంది ఎంట్రీ చేశారు.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
ఆస్పత్రి సిబ్బంది శిశువుని తండ్రికి అప్పగించారు. శిశువును ఇంటికి తరలించేందుకు తండ్రి అంబులెన్స్‌లోకి లెక్కిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో శిశువులో కదిలికలు రావడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. వైద్యులకు సమాచారం అందించగా.. వెంటనే వారు స్పందించి పీడియాట్రిక్ విభాగంలోని ఎన్‌ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. శిశువు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. చనిపోయాడని భావించిన శిశువు బతికే ఉండటంతో ఆ తండ్రి ఆనందంతో కంటతడి పెట్టుకున్నాడు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..