Vivek Venkataswamy: మంచిర్యాల జిల్లా మందమర్రిలోని B1 కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్మిక, మైనింగ్, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి 82 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అక్రమ కేసులు, అరెస్టులతో కేసీఆర్ రాచరిక పాలన సాగించారని వివేక్ ఆరోపించారు. తెలంగాణను 60 వేల కోట్ల అప్పుల నుంచి 8 లక్షల…
వారం రోజులుగా కేటీఆర్, అతని మనుషులు ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారని, తెలంగాణ ఉద్యమం, ప్రజల సమస్యలు చూపేందుకు v6 ఛానెల్ ను స్థాపించామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటసామి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టినా ఆగకుండా తెలంగాణ కల్చర్ చూపించింది v6 ఛానల్ అని, కాళేశ్వరం, మిషన్ భగీరధ లో జరిగిన అక్రమాలు, లోపాలను v6, వెలుగు పేపర్లు చూపించాయన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఈ రెండు…
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో దివంగత కాంగ్రెస్ నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 25వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మేయర్ అనిల్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణ, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన…
Chennur: రాష్ట్రంలో ఎంతో ఆసక్తి రేపిన చెన్నూర్ నియోజవర్గంలో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకుపోతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వెనుకంజలో ఉన్నారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తున్న వివేక్ వెంటకస్వామి భారీ ఆధిక్యతను కనబరుస్తున్నారు. కనుచూపు మేరలో కూడా బాల్క సుమన్ కనిపించడం లేదు.
Vivek: మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని సీఎం కేసీఆర్ చెబుతున్నారు, 2004లో ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ఆయన అన్నారు. సీఎంకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 85 ప్లస్ ఓట్లతో కాంగ్రెస్ గెలుస్తుందని జోక్యం చెప్పారు. బీఆర్ఎస్‌ది అవినీతి ప్రభుత్వమని ఆరోపించారు.
దమ్ముంటే అభివృద్ధి పైన మాట్లాడు.. లేదా బహిరంగ చర్చకు దా.. వివేక్ కి అతనిపై అతనికే నమ్మకం లేదు.. అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మారితే జనం ఎలా నమ్మతారు.. వివేక్ ఖచ్చితంగా ఓడి పోతారు.. అభివృద్ధిపై చర్చకు నేను సిద్ధం అంటూ వివేక్ వెంకటస్వామికి బాల్క సుమన్ సవాల్ విసిరారు.
IT Raids In Viveka Houses: మంచిర్యాల జిల్లా చెన్నూరులో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా వివేక్ ఎన్నికల బరిలో నిలిచారు.
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలను నన్ను కేసీఆర్ తన అవసరానికి వాడుకొని వదిలి పెట్టాడని ఆరోపించారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. ఇవాళ ఆయన మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, vivek venkataswamy, bjp, congress
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి భేటీ అయ్యారు. అనంతరం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. మల్లికార్జున ఖర్గే ఆశీస్సులు తీసుకున్నానని తెలిపారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ లోకి రావాల్సిందిగా కోరారని ఆయన వెల్లడించారు. breaking news, latest news, telugu news, vivek venkataswamy, mallikarjuna kharge
తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మేమే.. కింగ్ మేకర్స్ కాదు.. మేమే కింగ్‌లం అంటూ ప్రకటనలు చేస్తున్న బీజేపీ నేతలు ఇప్పటికీ మేనెఫెస్టో తీసుకురాలేకపోయారు.. ఇప్పటి వరకు వివేక్ నేతృత్వంలో మేనిఫెస్టోపై ఏదైనా కసరత్తు జరిగినా.. ఆయనే పార్టీకి గుడ్‌బై చెప్పడంతో ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్టు అయ్యింది.. తెలంగాణలో అసలైన ప్రత్యామ్నాయం తామే అంటున్న బీఆర్ఎస్.. ఎప్పుడు మేనిఫెస్టోపై కసరత్తు ప్రారంభించి.. ఇంకా ఎప్పుడు మేనిఫెస్టో తీసుకు వస్తుంది అనేది ప్రశ్నగా మారింది.