ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి భేటీ అయ్యారు. అనంతరం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. మల్లికార్జున ఖర్గే ఆశీస్సులు తీసుకున్నానని తెలిపారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ లోకి రావాల్సిందిగా కోరారని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ లో చేరడం ద్వారా, కేసీఆర్ రాక్షస పాలన నుంచి విముక్తి కల్పించేందుకు కృషి చేస్తానని, నాలుగేళ్లుగా కేసీఆర్ రాక్షస పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశానన్నారు. కేసీఆర్ ను ఓడించేందుకే పార్టీ మారానని, కేసీఆర్ ను ఓడించాలని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. బీజేపీ పరిస్థితి నాలుగేళ్ళ క్రితం ఎలా ఉందో, నేను బిజేపి లో చేరాక ఎలా ఉందో ప్రజలకు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Rajasthan: ఎన్నికల ముందు కాంగ్రెస్ చీఫ్ కుమారుడికి ఈడీ సమన్లు..
ఉద్యమ సమయంలో తెలంగాణ సాధన కోసం ముందడుగు వేశామని వివేక్ వెంకటస్వామి అన్నారు. అందరి సమిష్టి కృషితో వచ్చిన తెలంగాణ ను “బంగారు తెలంగాణ” అంటూ కేసీఆర్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. కుటుంబ పాలన, అవినీతి పాలనతో రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారని, కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో ప్రజలు ఇబ్బందులుపడ్డారని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. కమిషన్లకోసమే రిడిజైన్ చేశారని, ఎన్నికల్లో పోటీ అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Lavanya Tripathi: మెగా కోడలి పెళ్లి చీర.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ?