Morning Walk: ఈ ఆధునిక జీవన శైలిలో నడక అనేది అందరి జీవితంలో ఒక భాగం కావాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి నడకకు ఉదయాన్ని ఉత్తమ సమయంగా చెబుతుంటారు. నిజానికి నడక శరీరంలో శక్తిని పెంచుతుంది. అలాగే ఇది గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నడక రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, కండరాలను బలపరుస్తుంది, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, శీతాకాలంలో తెల్లవారుజామున చల్లని గాలులలో నడవడం…