ప్రధాని మోడీ మరోసారి అమెరికా పర్యటనకు సిద్ధపడుతున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఫిబ్రవరిలో మోడీ వైట్‌హౌస్ సందర్శించారు. ట్రంప్‌తో మంచి సంబంధాలు కనిపించాయి.
ప్రధాని మోడీ అగ్ర రాజ్యం అమెరికాలో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్‌కు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక ఆగస్టు చివరిలో గానీ.. సెప్టెంబర్ ప్రారంభంలో గానీ SCO సమ్మిట్ కోసం చైనా, జపాన్ కూడా సందర్శించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.