ఇజ్రాయెల్ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవి నేటి నుంచి మూడు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. హలేవి పర్యటన ఆసక్తి రేపుతోంది. మార్చి 6న హలేవీ పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో యూఎస్ పర్యటన కీలకంగా మారింది. ఈ పర్యటనలో వ్యూహాత్మక కార్యాచరణ దాగి ఉందని తెలుస్తోంది. కీలక అంశాలపై అమెరికా సీనియర్ కమాండర్లతో హలేవీ చర్చించనున్నారు. ఈ మేరకు ఆదివారం ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Pedda Gattu Jathara: ఘనంగా ప్రారంభమైన పెద్ద గట్టు జాతర.. వేలాదిగా హాజరైన భక్తులు
ఈనెల 15, మధ్యాహ్నం 12 గంటలలోపు ఇజ్రాయెల్ బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. కానీ హమాస్ మాత్రం లెక్కచేయలేదు. యథావిధిగా శనివారం ముగ్గురు బందీలనే విడుదల చేసింది. అయితే గాజాను స్వాధీనం చేసుకుంటామని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. పాలస్తీనియున్లంతా గాజా విడిచిపెట్టి వెళ్లిపోవాలని సూచించారు. ఇక ఆదివారం అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో ఇజ్రాయెల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హమాస్ అంతుచూస్తామని హెచ్చరించారు. అలాగే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా హమాస్‌పై యుద్ధం తప్పదని హెచ్చరించారు. ఇలా అమెరికా, ఇజ్రాయెల్ వరుస ప్రకటనలతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తప్పవని తెలుస్తున్నాయి. ఇక తాజాగా ఇజ్రాయెల్ సైన్యాధిపతి హలేవీ అమెరికాలో పర్యటించడం కూడా సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఏదో జరగబోతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Triptii Dimri : అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుందో ‘త్రిప్తి డిమ్రి’ ముద్దు గుమ్మ..