Bike Romance : సినిమాలను చూసి తామేదో హీరోహీరోయిన్లు అనుకుని రోడ్డుపై బైక్ రొమాన్స్ చేస్తూ ఓ యువజంట కెమెరాకు చిక్కారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి అసభ్యకర రీతిలో డ్రైవింగ్ చేస్తూ పక్కవారిని ఇబ్బందికి గురిచేశారు.
Botsa Satyanarayana: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న విశాఖలో వైసీపీ ఆధ్వర్యంలో ప్రజా గర్జన జరగనుంది. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో రేపు జరగబోయే గర్జన అందరి కళ్లు తెరిపిస్తుందని వ్యాఖ్యానించారు. విశాఖను రాజధానిగా వ్యతిరేకించే వాళ్ల కళ్లు తెరిపేలా తమ గర్జన ఉండబోతుందన్నారు. గర్జన తర్వాత ఏ నిమిషంలో విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం అవ్వాలన్నదే తమ కోరిక అని మంత్రి బొత్స తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణే కాదు…
Dharmana Prasad Rao: వికేంద్రీకరణ అంశంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసమానత కారణంగా ఉత్తరాంధ్రలో ఉన్న సంస్థలన్నీ అభివృద్ధి చెందిన ప్రాంతాల వారివేనని వెల్లడించారు. ఒక ప్రాంతం నెగ్లెట్ కావడంతో తమ ప్రాంతం బీదవారిగా మారిందన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల వారు ప్రశాంతంగా నివసించే పరిస్థితులు ఏపీలో ఒక్క విశాఖలో మాత్రమే ఉన్నాయని మంత్రి ధర్మాన అభిప్రాయపడ్డారు. అమరావతి చుట్టూ ఉన్న భూములు కేవలం కొందరి చేతుల్లోనే…
Dharmana Prasad Rao: రాజధాని వికేంద్రీకరణ అంశంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మంత్రి ధర్మాన ప్రసాదరావు సూటి ప్రశ్నలు వేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం టీడీపీ నేత అచ్చెన్నాయుడికి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. అసలు ఆయన శ్రీకాకుళానికి ఏం చేశారన.. రియల్ ఎస్టేట్ కోసం అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటారా అని నిలదీశారు. అమరావతిపై నిధులు ఖర్చు చేస్తే ఉత్తరాంధ్రకు మళ్లీ కష్టాలు తప్పవని ధర్మాన స్పష్టం చేశారు. మూడు రాజధానులతోనే ఏపీ అభివృద్ధి…
Dharmana Prasad Rao: విశాఖ రాజధాని విషయంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ విషయంలో సీఎం జగన్ అనుమతిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి ధర్మాన తెలిపారు. విశాఖ మన రాజధాని కావాలని, పిల్లల భవిష్యత్ కోసం ఉద్యమం చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తనకు ఉద్యమంలోకి వెళ్లాలన్న ఆలోచన ఉందని.. అందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ధర్మాన స్పష్టం చేశారు. మరోవైపు అమరావతి రైతుల…