విశాఖలోని ఆర్కే బీచ్‌లో ఓ వివాహిత శవమై కనిపించిన ఘటన కలకలం రేపింది. బీచ్ ఒడ్డున మృతదేహం పడి ఉన్న తీరు ఆమెదీ హత్య, లేక ఆత్మహత్యనా అన్న అనుమానాలు రేకెత్తించాయి. ఇసుకలో సగం మృతదేహం కూరుకుపోయి.. మిగతా సగం అర్థ నగ్నంగా కనిపించింది. మంగళవారం అత్తారింట్లో నుండి వెళ్లిపోయిన వివాహిత, ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారుపడ్డ అత్తామామలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు.
Heart Attack: విశాఖ స్టీల్ ప్లాంట్ డీజీఎం టీవీవీ ప్రసాద్ ఆకస్మికంగా మృతిచెందారు.. ప్లాంటు ప్రొడక్షన్ మానటరింగ్ విభాగంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం)గా పనిచేస్తున్న వెంకట వరప్రసాద్.. నిన్న జనరల్ షిఫ్ట్‌లో విధులకు హాజరయ్యారు.. అయితే, ఈడీ (వర్క్స్) ఆఫీస్ మూడో ఫ్లోర్లో లిఫ్ట్ దిగి తన రూమ్‌కు నడుస్తూ వెళ్తున్న ఆయన.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.. ఇది గమనించిన ఉద్యోగులు వెంటనే ఆయన్ను ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత ఉక్కు జనరల్ ఆస్పత్రికి…
విశాఖ నగరం పగలంతా హీట్ ఐలాండ్ ను తలపిస్తోంది. ఉదయం, సాయంత్ర దట్టమైన తేమగాలులు వీస్తున్నాయి. ఇది అసాధారణమైన పరిణామం కాకపోయినప్పటికీ సమ్మర్ తీవ్రత ఎంత స్థాయిలో పెరిగిందో గుర్తించవచ్చంటున్నారు వాతావరణ నిపుణులు.
Waltair Railway Division: విశాఖ – సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడుస్తోన్న విషయం విదితమే.. తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇదే కావడం విశేషం.. అయితే, అత్యధిక జనాదరణ కలిగిన రైలుగా వందే భారత్ కు గుర్తింపు లభించింది.. ఇక, అంతే కాదు.. రికార్డు స్థాయిలో కార్గో హ్యాండ్లింగ్ చేసిన రైల్వే డివిజన్‌గా వాల్తేరు రైల్వే డివిజన్ కొత్త రికార్డు సృష్టించింది.. ఈ విషయాన్ని వాల్తేరు డీఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి…
G20 Summit 2023: సాగర తీరం మరో ప్రతిష్టాత్మక సదస్సుకు సిద్ధమైంది.. విశాఖ వేదికగా నేటి నుంచి నాలుగు రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి.. ఇక, ఈ సదస్సు ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. విశాఖ సిటీని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.. ఈనెల 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను (జీఐఎస్) ఘనంగా నిర్వహిం అందరి దృష్టి ఆకర్షించిన ఏపీ సర్కార్.. ఇక, నేటి నుంచి జీ–20 దేశాల రెండో ఇన్ఫ్రాస్ట్రక్చర్…
విశాఖ వేదికగా టీమిండియా ఆసీస్‌తో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. ఆదివారం జరిగే రెండో వన్డేలో ఆసీస్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. మొదటి వన్డేలో అతికష్టం మీద విజయం సాధించిన టీమిండియా.. రెండో వన్డేలో రాణించాలని చూస్తోంది.
భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ లో గెలిచిన టీమిండియా ఇప్పుడు రెండో మ్యాచ్ పై ఫోకస్ చేసింది. తొలి వన్డే ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగగా.. రెండో వన్డే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదికగా జరగనుంది.
Vizag Capital: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. జులై నుంచి విశాఖకు వెళ్తున్నామని మంత్రులకు చెప్పారు సీఎం జగన్.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఆమోదించాల్సిన బిల్లుల కోసం కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. అధికారికంగా కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రులతో మాట్లాడిన సీఎం.. విశాఖ నుంచి పరిపాలన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట.. ఉగాది నుంచి సీఎం జగన్ .. విశాఖకు వెళ్తారని అక్కడి…