బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. ముఖ్యంగా కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది విశాఖ వాతావరణ కేంద్రం.. నైరుతి బంగాళాఖాతం దాన్ని అనుకోని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని.. రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తోందని.. దీని ప్రభావంతో నెల్లూరు నుంచి విజయనగరం జిల్లా వరకు కోస్తా అంతటా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.