వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అతిపెద్ద వైసీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరిపాలన రాజధానిలో అతిపెద్ద జెండాను ఆవిష్కరించడం సంతోషం అని అన్నారు. మరోసారి విశాఖ నుంచే పరిపాలన జరుగుతుందని వైవీ స్పష్టం చేశారు. కోర్టులో చిన్న చిన్న అడ్డంకులు ఉండడం వలన పరిపాలన రాజధానిగా విశాఖ ఆలస్యమైందని తెలిపారు.
విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో జరిగిన 'ఆడుదాం ఆంధ్రా' ముగింపు వేడుకల్లో సీఎం జగన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏలూరు-వైజాగ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ను వీక్షించారు. అనంతరం విజేతలకు జగన్ స్వయంగా బహుమతుల ప్రదానం చేశారు. ఆడుదాం ఆంధ్రా టోర్నీ దాదాపు 50 రోజుల పాటు జరిగాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చాలా ముఖ్యం.. మట్టిలోని మాణిక్యాలను గుర్తించడానికే ఆడుదాం ఆంధ్రా అని అన్నారు. 47…
ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్.. ఘటన జరిగిన గంటల 14 గంటల వ్యవధిలో నిందితుడిని గుర్తించాం.. ఎమ్మార్వో హత్య కేసుకు ల్యాండ్ ఇష్యు నే కారణంగా పేర్కొన్నారు. నగరానికి చెందిన ఓ రియల్టర్ ఎమ్మార్వో హత్యకు పాల్పడ్డట్టు ఆధారాలు లభ్యమయ్యాయి..
విశాఖ విమానాశ్రయంలో పండుగ రద్దీ వేళ పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. సర్వీసులు రద్దు కావడంతో పండగ పూట గమ్యస్థానానికి చేరుకోలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి వాతావరణం అనుకూలించక విశాఖ రావలసిన సర్వీసులు రద్దయ్యాయి.
విశాఖ నడిబొడ్డులో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన ఓ మహిళ డాక్టర్ వీఐపీ రోడ్డులో వీరంగం సృష్టించింది.. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఉలిక్కి పడింది.. ఇన్నోవా కారును డ్రైవ్ చేసిన డాక్టరమ్మా అతి వేగంతో ఇతర వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెతోపాటు కారులో ప్రయాణిస్తున్న వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై త్రీ టౌన్ పోలీసులు…
NTV కథనాన్ని చూసిన ఎయిర్ ఇండియా అధికారులు వెంటనే స్పందించి మొదట విడతగా 80 మందికి మధ్యాహ్నం 01:30 గంటలకి స్పెషల్ విమానంలో పోర్టు బ్లైర్ కి తరలించారు. మిగతావారిని నెక్స్ట్ ఫ్లైట్ లో పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
IND VS AUS : నేటి నుంచే విశాఖ వన్డే టికెట్లు అమ్మకం ప్రారంభం కానుంది. ఈ నెల 19న ఏసీఏ వీడిసిఏ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా ల మధ్య సెకండ్ వన్డే జరగనున్నాయి. పేటీఎం ఇన్సైడర్ ద్వారా ఆన్లైన్లో టికెట్ల అమ్మకం జరుగనున్నాయి.
వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. గత ఎన్నికల్లో పోటీ చేసి విజయాన్ని అందికోలేకపోయారు.. అయితే, మరోసారి ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం పక్కా అని చెబుతూనే ఉన్నారు.. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అన్నట్లుగా.. తాను ఓటమి పాలైన లోక్‌సభ స్థానం నుంచే మళ్లీ పోటీ చేస్తానని చెబుతూనే వస్తున్నారు వీవీ లక్ష్మీనారాయణ.. గత ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగారు.. ఆ తర్వాత రాజీనామా చేయడంతో.. ఈ సారి…