విశాఖను డ్రగ్స్ మత్తు ఆవరిస్తోంది. డ్రగ్స్ పెడ్లర్స్ స్టీల్ సిటీని సేఫ్ సిటీగా భావిస్తున్నట్టు అనిపిస్తోంది. విశాఖలో డ్రగ్స్ వ్యవహారంపై యువత తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్దులు, యువతనే టార్గెట్ చేసుకుని విశాఖ నుంచి విజయవాడ, ముంబైకి డ్రగ్స్ తరలిపోతున్నాయి. విశాఖకు చెందిన పోలీసులు పలువురు యువతను అరెస్ట్ చేశారు. నగరంలోని ఎన్‌ఏడీ జంక్షన్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా దాడి జరిపి భారీగా డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు.…
విశాఖ మన్యం ధారకొండ ఘాట్ రోడ్డులో దొంగతనాలు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. విశాఖ గ్రామీణ జిల్లా పోలీసులు ముఠాను అరెస్ట్ వారి వద్ద నుంచి కారు , మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు . దీనికి సంబందించి గూడెం కొత్తవీధి సీఐ అశోకుమార్ వివరాలు అందచేశారు. విశాఖ గ్రామీణ జిల్లా ఎస్పీ బి . కృష్ణారావు ఆదేశాలు మేరకు చింతపల్లి ఎఎస్పీ తుషారూదీ , సీసీఎస్ డీఎస్పీ డీఎస్ఆర్ఎఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో జీకేవీధి సీఐ అశోకకుమార్…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ దసరా పండుగ సందర్భంగా ఊరు ఊరు కో జమ్మిచెట్టు గుడి గుడి కో జమ్మిచెట్టు కార్యక్రమంలో భాగంగా విజయదశమి పర్వదినాన విశాఖ శ్రీ శారదాపీఠం ప్రాంగణంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి జమ్మిచెట్టు ను నాటారు. ఇక విశాఖ శ్రీ శారదాపీఠంలో విజయదశమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దసరా పర్వదినాన శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు విజయదుర్గ అవతారంలో…