Visakha : అక్కడేలా పార్క్ చేశావమ్మా… మద్యం మత్తులో మహిళా డాక్టర్ ర్యాష్ డ్రైవింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ నడిబొడ్డులో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన ఓ మహిళ డాక్టర్ వీఐపీ రోడ్డులో వీరంగం సృష్టించింది.. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఉలిక్కి పడింది.. ఇన్నోవా కారును డ్రైవ్ చేసిన డాక్టరమ్మా అతి వేగంతో ఇతర వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెతోపాటు కారులో ప్రయాణిస్తున్న వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై త్రీ టౌన్ పోలీసులు సమాచారం అందడంతో అక్కడికి చేసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
విశాఖలోని వీఐపీ రోడ్డులో సోమా రెస్టో బార్ అండ్ రెస్టారెంట్ లో మహిళతో పాటు కొంతమంది యువకులు ఫుల్ గా మద్యం సేవించారు. అక్కడి పార్కింగ్ స్థలం నుంచి వీఐసీ రోడ్డులోని సిరిపురం వెళ్లే మార్గంలో కారులో వేగంగా దూసుకొచ్చారు. ఈ క్రమంలో కారు అదుపు తప్పి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. దీంతో పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన ఎనిమిది వాహనాలను కారు ఢీకొట్టడంతో ఆ వాహనాలు ధ్వంసం అయ్యాయి. అయితే పార్కింగ్ స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.. ఎటువంటి ప్రాణహాని జరగలేదు..
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
ప్రమాదం జరిగిన ప్రాంతం అంతా ఎప్పుడు జనాలతో రద్దిగా ఉంటుంది.. కానీ ప్రమాదం సమయంలో జనం లేకపోవడంతో ఏం జరగలేదు.. అయితే ఒక్కసారిగా కారు ఢీకొట్టడంతో భారీ శబ్ధం వచ్చింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఒక్కసారిగా ప్రజలు గుమిగూడడంతో కారులో ఉన్న వారంతా భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. వెంటనే అక్కడికి వేరే కారు రావడంతో అందులో వారంతా పరారయ్యారు. అయితే కారు ఎవరు డ్రైవ్ చేశారు? ఆ సమయంలో కారులో ఎంత మంది ఉన్నారు? వారు ఎక్కడి నుంచి వచ్చారు? కారులో ఉన్న వారు ఎవరు? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ కెమెరా పుటేజీతోపాటు రెస్టో బార్ కు సంబంధించిన పుటేజీని కూడా పరిశీలిస్తున్నారు.. ప్రస్తుతం మహిళా డాక్టర్ ను పోలీసులు అదుపులోకి విచారిస్తున్నారు.. ఈ ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
తాజావార్తలు
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!
-
Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
-
Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
ట్రెండింగ్
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..