క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్ పోటీల్లో టీమ్ ఇండియా ఓటమిని చవి చూసింది.. ఈ విషయాన్ని చాలా మందికి మింగుడు పడటం లేదు.. ప్రపంచ టోర్నీలో అన్ని మ్యాచ్ లలో భారత జట్టు బాగా ఆడినప్పటికీ ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టీమ్ ఇండియా ఓటమి పాలైంది.. మ్యాచ్ ఓడిన తర్వాత టీమ్ అందరు ఎమోషనల్ అయ్యారు.. కోహ్లీ బాధపడుతుంటే అతని భార్య అనుష్క శర్మ అతన్ని ఓదారుస్తూ ధైర్యం చెబుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో…
ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కు ముందు ఆసీస్ సారథి పాట్ కమిన్స్ మీడియాతో మాట్లాడినట్లుగానే చేశాడు. స్టేడియంలో 1 లక్ష 32 వేల మంది టీమిండియా తరుఫున సపోర్ట్ చేస్తారని.. అభిమానులను ఎలా ఆశ్చర్యపరచాలో తనకు, తమ జట్టుకు తెలుసన్నాడు. అనుకున్నట్లు గానే చేసి చూపించాడు. టీమిండియా ఎక్కువగా ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ ఔట్ చేసి స్టేడియంలో ఉన్న అభిమానులందరినీ పిన్ డ్రాప్ సైలంట్ చేసి చూపించాడు. కోహ్లీ ఔట్ అవ్వడంతో స్టేడియంలో ఉన్న అభిమానులతో…
World Cup final: ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచులో కలకలం రేగింది. ఫ్రీ పాలస్తీనా అంటూ టీషర్ట్, పాలస్తీనా జెండా రంగులు కలిగిన మాస్క్ ధరించిన ఓ వ్యక్తి గ్రౌండ్ లోకి దూసుకొచ్చాడు. పిచ్ వద్దకు వచ్చి బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీని కౌగిలించుకోవడానికి ప్రయత్నించారు.
న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసి రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. నిన్నటి సెంచరీ విరాట్ కు 50 సెంచరీ కావడంతో సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇదిలా ఉంటే.. కోహ్లీ సెంచరీని ఊహించని.. ఉత్తరప్రదేశ్ లోని ఓ రెస్టారెంట్ యజమాని ఓ బంపర్ ఆఫర్ ప్రకటించాడు.
Shreyas Iyer: స్వదేశంలో జరుగున్న వన్డే ప్రపంచకప్ టోర్నీలో భారత్ విజయానికి తిరుగులేకుండా పోయింది. ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్‌కి చేరుకుంది. వరల్డ్ కప్‌ని ముద్దాడటానికి కేవలం ఒక్క విజయానికి దూరంలో ఉంది. బుధవారం న్యూజిలాండ్‌తో ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచు అనేక రికార్డులకు వేదికగా మారింది.
Virat Kohli tries to find Anushka Sharma during IND vs NZ Match: టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు ‘విరాట్ కోహ్లీ’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో ఎంత సీరియస్‌గా ఉంటాడో.. బయట అంతే సరదాగా ఉంటాడు. సహచరులతో కలిసి తెగ అల్లరి చేస్తుంటాడు. భారత ఆటగాళ్లను ఇమిటేట్ చేస్తూ.. అప్పుడప్పుడు డ్యాన్స్‌తోనూ విరాట్ ఆకట్టుకుంటాడు. ఇవన్నీ ఓ ఎతైతే.. కోహ్లీ తన భార్య అనుష్క శర్మ పట్ల ఎంతో…
వరల్డ్ కప్‌లో ఫైనల్స్‌కు దూసుకెళ్లింది టీమిండియా. 2019 పరాభవానికి న్యూజిలాండ్‌పై ప్రతీకారం తీర్చుకుంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అద్భుతంగా రాణించి ఫైనల్ చేరింది టీమిండియా. భారత్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌పై 70 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
Virat Kohli: కింగ్ విరాట్ కోహ్లీకి దేశవ్యాప్తంగా అభినందనలు అందుతున్నాయి. ఈ రోజు న్యూజిలాండ్‌తో ముంబైలో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచులో విరాట్ కోహ్లీ క్రికెట్ హిస్టరీలోనే రికార్డ్ క్రియేట్ చేశారు. సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డును బద్ధలు కొడుతూ.. 50వ సెంచరీ సాధించారు.
వాంఖడే మైదానంలో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కింగ్ కోహ్లీ పేరిట ఉంది. 2023 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ బ్యాట్ నుండి ఈ చారిత్రాత్మక సెంచరీ వచ్చింది.