Virat Kohli-Anushka Sharma: విరాట్ కోహ్లీ-అనుష్క శర్మల బంధానికి ఆరేళ్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli-Anushka Sharma’s 6th Anniversary: చాలా మంది సెలబ్రిటీల మాదిరే.. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల ప్రేమ బంధం కూడా మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుందంటూ సోషల్ మీడియాలో ఎన్నో వదంతులు వచ్చాయి. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ.. తమ ప్రేమ బంధాన్ని విరుష్క జోడి పెళ్లి పీటలు వరకు తీసుకెళ్లారు. కోహ్లీ-అనుష్కలు వివాహబంధంతో ఒక్కటై నేటికి ఆరేళ్లు పూర్తయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో విరుష్క (#virushka) ట్రెండింగ్‌లోకి వచ్చింది.
2013లో ఓ షాంపు యాడ్ కోసం చేసిన చిత్రీకరణలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు మొదటిసారి కలుసుకున్నారు. ఇద్దరు చిత్రీకరణలో స్నేహితులుగా మారారు. ఆ తర్వాత వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. విరుష్క జోడి కొన్నేళ్లు ప్రేమాయణం సాగించారు. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించడంతో.. 2017 డిసెంబర్ 11న ఇటలీలో అతికొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వీరి ప్రేమబంధానికి గుర్తింపుగా ‘వామిక’ అనే కూతురు ఉంది. ప్రస్తుతం అనుష్క గర్భవతి.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
Also Read: WhatsApp Ticket: మెట్రో మాదిరి.. వాట్సప్‌లోనే బస్సు టికెట్ జారీ!
వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ అనంతరం విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ ద్వారా తిరిగి భారత జట్టులోకి అడుగుపెట్టనున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్, ఆపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో కోహ్లీ ఆడనున్నాడు. ప్రపంచకప్ 2023లో విరాట్ పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. మరోవైపు పెళ్లి అనంతరం అనుష్క శర్మ సినిమాలకు దూరంగా ఉంటూ.. కుటుంబంతో గడుపుతున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!