ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సోషల్ మీడియాలో అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రేటీలలో విరాట్ కోహ్లీ ఒకరు.. ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న సెలబ్రిటీ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. ఈ జంటను ఫ్యాన్స్ ముద్దుగా ‘విరుష్క’ అని పిలుస్తారు.. వీరు ఎక్కడ కనిపించినా ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది..
వీరిద్దరూ మోస్ట్ స్టైలిష్ ఇండియన్ కపుల్స్‌గా కూడా గుర్తింపు పొందారు. ఇటీవల విరాట్, అనుష్క 6వ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నారు.. ఆ సమయంలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు విరాట్.. చాలా మంది లైక్ చేశారు. విరాట్, అనుష్క లుక్, డ్రెస్ గురించి బోలెడు చర్చలు జరిగాయి.. ఆ ఫోటోలు నెట్టింట ఇప్పటికి ట్రెండ్ అవుతున్నాయి.. ఆ ఫోటోలలో వాళ్ల డ్రెస్సులతో విరాట్ కోహ్లీ పెట్టుకున్న వాచ్ ధర సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
అది అద్భుతమైన టైమ్‌పీస్ గోల్డ్ కాస్మోగ్రాఫ్ డేటోనా రోలెక్స్.. ఈ లగ్జరీ వాచ్ ఇంటెన్స్ బ్లాక్, షాంపైన్-కలర్ డైమండ్-సెట్ డయల్‌తో పాటు ఓస్టెర్ బ్రాస్‌లెట్‌తో వస్తుంది. ఇది ఎంగ్రేవ్డ్ టాకిమెట్రిక్ స్కేల్‌తో 18-క్యారెట్ ఎల్లో గోల్డ్ బేజెల్‌ను కలిగి ఉంది. ఈ అద్భుతమైన టైమ్‌పీస్‌ను కొనుగోలు చేయాలంటే ఏకంగా రూ.3 కోట్ల కు పైగా ఉంటుందని తెలుస్తుంది.. విరాట్ కోహ్లీకి లగ్జరీ వాచ్‌లంటే చాలా ఇష్టం. అతని వద్ద అద్భుతమైన వాచ్‌లు ఉన్నాయి. అన్నింటి కంటే అత్యంత ఖరీదైనది రెయిన్‌బో ఎవెరోస్ గోల్డ్ రోలెక్స్ డేటోనా.. ఇది డైమాండ్స్ పొదిగిన వాచ్.. దీని ధర రూ. 4 కోట్లు ఉంటుందని తెలుస్తుంది.. ఇవే కాదు చాలా ఖరీదైన వాచ్ లు ఉన్నాయి..