ఆటకు ఇవ్వగలిగినంత ఇచ్చానన్న స్పష్టతతో విరాట్ కోహ్లీ ఉన్నాడని, అతడిలో ఎలాంటి విచారం లేదు అని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. విరాట్ రిటైర్ కావడం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపాడు. మరో 2-3 ఏళ్లు టెస్ట్ ఫార్మాట్లో ఆడే సత్తా అతడిలో ఉందని అభిప్రాయపడ్డాడు. విశ్రాంతి తీసుకోకపోతే మానసికంగా అలసిపోక తప్పదు అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. విరాట్ టెస్ట్ కెరీర్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ టూర్‌కు ముందు తనకు ఇష్టమైన సాంప్రదాయ ఫార్మాట్‌కు…
టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ టూర్‌కు ముందు తనకు ఇష్టమైన సాంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికి అందరికీ షాక్ ఇచ్చాడు. విరాట్ అప్పుడే రిటైర్‌మెంట్ ఇవ్వాల్సింది కాదని, మరికొన్ని సంవత్సరాలు ఆడాల్సిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. విరాట్ ఉన్నపళంగా వీడ్కోలు పలకడంతో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో అని ఫాన్స్ ఆసక్తిగా చుస్తున్నారు. రిటైర్‌మెంట్ నేపథ్యంలో విరాట్ టీ20, టెస్ట్ కెరీర్…
టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్ చేశాడు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం పొట్టి క్రికెట్‌కు టాటా చెప్పిన కోహ్లీ.. తాజాగా టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. ఇక కింగ్ కేవలం వన్డేల్లో మాత్రమే ఆడనున్నాడు. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడాడు. 2011లో టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన విరాట్.. 123 టెస్టులు ఆడి 46.85 సగటుతో 9,230 పరుగులు…
టీమిండియా క్రికెట్ అభిమానులకు హార్ట్ బ్రేకింగ్ న్యూస్. భారత స్టార్ బ్యాటర్, కింగ్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈమేరకు కాసేపటి క్రితం తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్ చేశాడు. గత వారమే కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా.. ఇప్పుడు కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చాడు. దాంతో రోహిత్, కోహ్లీ లేకుండానే ఇంగ్లండ్‌తో భారత్ టెస్ట్ సిరీస్ ఆడనుంది. రోహిత్, కోహ్లీలు ఒకేసారి టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.…
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఉన్నపళంగా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ షాక్ నుంచి తేరుకునేలోపే ‘కింగ్’ విరాట్ కోహ్లీ కూడా సాంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని విరాట్ బీసీసీఐకి కూడా తెలియజేశాడట. కీలకమైన ఇంగ్లండ్ పర్యటన ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని బీసీసీఐ కోరిందని సమాచారం. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, మరికొన్ని సంవత్సరాలు టెస్ట్ క్రికెట్ ఆడాలని సూచించినట్లు…