భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలోనూ నిరాశ పరిచాడు. పెర్త్ వన్డేలో 8 బంతులు ఆడి డకౌట్ అయిన కోహ్లీ.. అడిలైడ్ వన్డేలో నాలుగు బంతులు ఆడి ఖాతా తెరవలేదు. ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన విరాట్.. రెండు వన్డేల్లో నిరాశపరచడంతో ఫాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. కింగ్ తన వన్డే కెరీర్‌లో ఇలా వరుసగా రెండు మ్యాచుల్లో డకౌట్ అవ్వడం ఇదే మొదటిసారి. అవుట్ అయిన అనంతరం…