భారత యువ క్రికెటర్ విప్రజ్ నిగమ్ ఓ సమస్యలో చిక్కుకున్నాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న విప్రజ్‌ను ఓ మహిళ బ్లాక్‌మెయిలింగ్‌కు గురిచేస్తోంది. గత రెండు నెలలుగా సదరు మహిళ అనుచిత డిమాండ్లు చేస్తోందని, తాను అంగీకరించకపోతే ప్రైవేట్ వీడియోలు వైరల్ చేస్తానని బెదిరిస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. విప్రజ్ ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలోని కొత్వాలి నగర్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదయింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నివేదికల ప్రకారం… విప్రజ్ నిగమ్‌కు 2025 సెప్టెంబర్‌లో…