టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్.. నిర్మాణ రంగంతో పాటు సినిమాల పంపిణి రంగంలోను ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. అన్నపూర్ణ సంస్థకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాల డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు కూడా ఉన్నాయి. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించి ఇప్పుడో మరో సెన్సేషనల్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కేవలం తెలుగు సినిమాలు మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తున్న అన్నపూర్ణ తొలిసారి నాన్-తెలుగు చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. కంటెంట్ బేస్ సినిమాలకు కేరాఫ్ అయిన మలయాళంలో…
పాతికేళ్ళ క్రితం తెలుగువారిని ఆకట్టుకున్న 'ప్రేమదేశం' చిత్రం ఇప్పుడు మరోసారి జనం ముందుకు రాబోతోంది. విశేషం ఏమంటే... తాజాగా అదే పేరుతో మరో 'ప్రేమదేశం' తెరకెక్కింది. ఈ రెండు సినిమాలు శుక్రవారమే విడుదల అవుతున్నాయి.
(ఆగస్టు 23న ‘ప్రేమదేశం’కు 25 ఏళ్ళు పూర్తి) ఇప్పటికీ ఎప్పటికీ ఎన్నటికీ ఆకర్షించే అంశమేది అంటే ‘ప్రేమ’ అనే చెప్పాలి. కాలం మారినా ప్రేమకథలకు సాహిత్యంలోనూ, సమాజంలోనూ, సినిమాల్లోనూ ఆదరణ ఉంటూనే ఉంది. ప్రముఖ తమిళ దర్శకుడు ఆ ఉద్దేశంతోనే కాబోలు తాను తెరకెక్కించిన అన్ని చిత్రాలనూ ప్రేమ చుట్టూ తిప్పాడు. టైటిల్స్ లోనూ ప్రేమనే జోడించాడు. ఆయన దర్శకత్వంలో ‘జెంటిల్ మేన్’ కె.టి.కుంజుమోన్ నిర్మించిన ‘కాదల్ దేశం’ చిత్రం తెలుగులో ‘ప్రేమదేశం’ పేరుతో విడుదలై విజయఢంకా…