రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరు వాడ మొత్తం గణేశుని నామస్మరణంతో మారుమోగుతోంది. లంబోధరుడిని వివిధ రూపాల్లో కొలువుతీర్చి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గణేష్ మండపాల వద్ద విద్యుత్ కాంతుల శోభతో ప్రత్యేక కళను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా వివిధ రూపాల్లో వినాయకుని విగ్రహాలు కళకళలాడుతున్నాయి.
Somu Veerraju: ఏపీలో వినాయక చవితి పండగ సందర్భంగా ఆంక్షలు విధించారంటూ వస్తున్న వార్తలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితికి ప్రభుత్వం విధించిన ఆంక్షలు యావత్ ఆంధ్ర ప్రదేశ్ నివ్వెరపోయేలా ఉన్నాయని ఆరోపించారు. ప్రస్తుతం వినాయక చవితికి పందిరి వేసుకుంటే ఫైర్, విద్యుత్, పోలీసుల పర్మిషన్ కావాలని.. చందాలు అడగాలన్నా పర్మిషన్ కావాలని, అసలు ఈ ప్రభుత్వం మనలో పుట్టిందా లేదా అమెరికా నుంచి ఏమైనా…