నర్సీపట్నంలో వాతావరణం హాట్ హాట్ గా కొనసాగుతోంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను కూల్చేందుకు తీసుకుని వచ్చిన జేసీబీ అద్దాలు ధ్వంసం చేశారు. అనకాపల్లి నుంచి వస్తున్న జేసీబీని దుంగనవానిపాలెం దగ్గర అడ్డుకుని గాలి తీసేసి నిరసన తెలిపారు. అయ్యన్న ఇంటి దగ్గరే మకాం వేసిన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అధికారులను అడ్డుకుంటున్నారు. నర్సీపట్నంలో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటికి చేరుకున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ కూల్చివేత…