విజయవాడలో 15 అడుగుల వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేశారు. ఈ సందర్భంగా ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. సీఎం జగన్ భయపెట్టాడు కనుకనే మీడియా ముందు లోకేష్ ఏడ్చాడు అని తెలిపారు. 50 రోజులు దాటే సరికి ఒకొక్కడికి కాళ్ళు చేతులు ఒణుకుతున్నాయి.. 371 కోట్లు పవన్ కి చిన్న అమౌంట్ ఏమో కానీ మా పేదవాళ్ళకి పెద్దదే అని ఆయన తెలిపారు. వంగవీటి రంగాను పొట్టన పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు.. రాజకీయ నాయకుడివే కాదు కనుక రెంటుకు పార్టీ పెట్టావు పవన్.. పోటీ చేయలేడు కాబట్టే పవన్ పార్టీ అద్దెకు పెట్టాడు అని ఎంపీ విమర్శలు గుప్పించారు. బీసీలను ఎక్కిరించిన చంద్రబాబు బీసీ తీర్పుతోనే జైలు కెళ్ళాడు అంటూ ఎంపీ నందిగం సురేష్ అన్నారు.
Read Also: Mahesh Babu: పెద్దోడు మాస్.. చిన్నోడు క్లాస్.. ఏమున్నార్రా బాబు
నారా లోకేష్ కొడుకు ఏం బిజినెస్ చేసాడో తెలీదు కోట్ల రూపాయలు అకౌంట్లో ఉన్నాయని ఎంపీ నందిగం సురేష్ అడిగారు. కానీ, మన పిల్లలకి మాత్రం ఇంగ్లీషు రాకూడదు.. చదువు రాకూడదు.. చంద్రబాబు ఎస్సీ, బీసీలను జైల్లో కూర్చోపెడితే.. జగన్ మాత్రం నరేంద్ర మోడీ పక్కన కూర్చోబెట్టాడాని ఆయన గుర్తు చేశారు. కులాల మీద ఏదీ నిర్మించలేం..సంపద అంతా చంద్రబాబు, ఆయన కొడుకు తిని రోడ్లు వేయలేదు.. రెండు ఎకరాలు ఎలా కోట్ల రూపాయలు చేయాలో తెలియడం లేదు.. చంద్రబాబు కోట్ల రూపాయలు సంపాదించాడు.. చంద్రబాబు వి నక్క వినయాలు, అతనొక మొసలి.. లోకేష్ అరకొర నేర్చుకొని మాట్లాడతాడు.. పవన్ కళ్యాణ్ వాళ్ళ వీళ్ళ కాళ్ళ వేళ్ళ పడి చిరంజీవి ఫ్యామిలీ పరువు తీసాడు అంటూ ఎంపీ నందిగం సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.