విజయవాడ రైల్వేస్టేషన్‌కి బాంబు బెదిరింపు కాల్ వచ్చిందని.. పాకిస్థాన్‌కు చెందిన హుస్సేన్ అనే వ్యక్తి పేరుతో ఫోన్ చేశారని సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ కోట జోజి తెలిపారు. "స్టేషనులో బాంబు పెట్టాం అని కాల్ చేసిన హుస్సేన్ చెప్పాడు.. ఫోన్ ట్రాక్ చేస్తే ఆర్ఆర్ పేట రైల్వే లైను వద్ద సిగ్నల్ వచ్చింది. కాల్ వచ్చినపుడు ముంబై నుంచీ విశాఖ వెళ్ళే రైలు వెళ్ళింది.. ఆ రైలును కూడా పూర్యిగా తనిఖీ చేశాం..
విజయవాడ రైల్వే స్టేషన్ FSSAI నుండి '5 స్టార్ ఈట్ రైట్ స్టేషన్' సర్టిఫికేట్ పొందింది.. విజయవాడ రైల్వే స్టేషన్ అత్యుత్తమ పరిశుభ్రత మరియు సురక్షితమైన ఆహార పద్ధతులను అమలు చేసినందుకు భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) నుండి ప్రతిష్టాత్మకమైన 'ఈట్ రైట్ స్టేషన్' ధృవీకరణను పొందింది.
నేటి నుంచి ప్రయాణికుల కోసం ఎకనామి మీల్స్ పేరుతో కేవలం రూ. 20కు నాణ్యమైన భోజనం అందుబాటులోకి తెచ్చారు ఐఆర్సీటీసీ అధికారులు. ప్రస్తుతం వేసవి కాలం సందర్భంగా అనేక మార్గాలలో ప్రత్యేక రైలుతోపాటు.. అధికారులు స్పెషల్ భోజనాన్ని అందిస్తున్నారు. దీనికోసం విజయవాడ రైల్వే స్టేషన్లో జనరల్ బోగీలు ఆగే స్థలానికి దగ్గరలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు రైల్వే అధికారులు. Also read: Shocking video: బైకర్‌పై దూసుకెళ్లిన బస్సు.. పట్టించుకోని బాటసారులు.. వీడియో వైరల్ ఇందులో…
భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన నలుగురు బంగ్లాదేశ్‌కు చెందిన యువకులను అరెస్ట్ చేవారు బెజవాడ పోలీసులు.. పోలీసుల విచారణలో తుల్లానా జిల్లా నుండి భారత్‌లోకి ప్రవేశించినట్టుగా తెలిపారు.. ఆ తర్వాత హావ్ డా – వాస్కోడిగామా రైలులో వెళ్తుండగా బెజవాడలో అదుపులోకి తీసుకున్నారు రైల్వే పోలీసులు.. పాస్ పోర్ట్ లేకుండా నల్లాల ద్వారా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్టు గుర్తించారు.. దర్బంగా ఘటనతో అప్రమత్తమైన పోలీసులు.. అసలు ఆ యువకులు ఏపీలోకి రావడానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేపట్టారు..…