బెజవాడ నగరపాలక సంస్థలో మేయర్‌కు...పదవీగండం తప్పేలా లేదు. ఎన్నికలకు ముందు వైసీపీకి 49 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ప్రస్తుతం దాని 38కి పడిపోయింది. వీరిలో మరో 10 మందికి పైగా కూటమి పార్టీల ప్రజాప్రతినిధులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 64 మంది కార్పొరేటర్లున్న బెజవాడ కార్పొరేషన్‌లో...మేయర్ పీఠానికి 33 మంది సభ్యులు అవసరం. ప్రస్తుతం వైసీపీలో ఉన్న వారిలో ఏడుగురు వెళ్లిపోతే...మేయర్ కుర్చీ ఆ పార్టీకి దూరమైనట్టే. ఇప్పటికే ఐదుగురు టీడీపీలోకి, నలుగురు జనసేన, బీజేపీలో ఇద్దరు…