Vijayapriya Nithyananda: విజయప్రియ నిత్యానంద ఎవరు..? ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలువురు ఆమె గురించి సెర్చ్ చేస్తున్నారు. భారత్ తో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద మతగురువు నిత్యానంద ‘కైలాస’ అనే ప్రత్యేక దేశాన్ని స్థాపించారు. అయితే ఈ దేశానికి ప్రతినిధులుగా ఇటీవల ఐక్యరాజ్యసమితిలో విజయప్రియ నిత్యానంద కనిపించారు. తనను తాను ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నారు.
Nithyananda: లైంగిక ఆరోపణలు, కిడ్నాప్ కేసుల్లో చిక్కుకున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద.. ఆ తర్వాత దేశం విడిచి పారిపోయారు.. ఏకంగా ఓ దేశాన్నే స్థాపించేశారు.. దానికి ‘కైలాస’ దేశంగా నామకరణం చేశారు.. ఇక ప్రత్యేక కరెన్సీ.. తమ దేశంలో అడుగుపెట్టాలంటే.. వీసా ఉండాల్సిందే.. లాంటి నిబంధలు పెట్టారని కూడా వార్తలు వినిపించాయి.. అయితే, ఇప్పుడు నిత్యానంద స్థాపించిన ‘కైలాస’ దేశం ప్రతినిధి.. ఐక్యరాజ్యసమితి చర్చల్లో పాన్గొనడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. జెనీవాలో సుస్థిర అభివృద్ధి అంశంపై…