భారతీయ జనతా పార్టీ ప్రధాని మోడీతో నిర్వహించిన విజయ సంకల్ప సభ బాగా విజయవంతమైందని బీజేపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. లక్షలాది మంది తరలిరావడం.. ఏర్పాట్లు బాగా చేయడంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భుజం తట్టడం.. ప్రధాని సహా ఇతర నేతలంతా హుషారుగా కనిపించడంతో రాష్ట్ర పార్టీ నాయకులు సంబరాలు అంబరాన్నంటాయి. అయితే.. మరోవైపు సభ విజయవంతం కావడం బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని.. ఇదొక టానిక్‌లా పనిచేస్తుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రముఖనేతల ప్రసంగాలకు సభికులు కేరింతలు.. చప్పట్లతో సభా ప్రాంగాణం మార్మోగడాన్ని గుర్తు చేస్తున్నాయి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో తప్ప ఒక రాజకీయ సభకు ప్రజల నుంచి ఇంతటి స్పందన రావడం విశేషమని అభిప్రాయపడుతున్నాయి.
Jagadish Reddy : సిగ్నల్ ఫ్రీ ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ ది
నేడు ఏపీ పర్యటనకు ప్రధానిమోడీ వెళ్లనున్నాను. ఇవాళ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని సాంస్కతిక.. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగే అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. కాగా.. ఇవాళ ప్రధాని మోదీ పర్యటనకు భీమవరం ముస్తాబైంది. అల్లూరి జయంతి వేడుకలకు ప్రధానితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సినీ నటుడు చిరంజీవితో పాటు ప్రముఖులు హాజరుకానున్నారు. అల్లూరి కుటుంబ సభ్యులు, వారసులతో ప్రధాని, సీఎం ప్రత్యేకంగా మాట్లాడి వారి కుటుంబ సభ్యుల్లో ఇద్దరిని ప్రధాని సత్కరిస్తారు.