ఇక నుంచి జంట నగరాల్లో కృష్ణా యూనియన్ పాల ఉత్పత్తులు లభ్యం కానున్నాయి. స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులను విజయ బ్రాండ్ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఆరు దశాబ్దాలుగా వినియోగదారులు విశ్వాసం చూరగొంటున్న కృష్ణ మిల్క్ యూనియన్ వారి విజయ పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో లభ్యం కానున్నాయి.
Milk Prices: నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతున్న సామాన్యుడికి మరో షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 1 నుంచి విజయ పాల ధరలు పెరుగుతున్నాయి. ఈ మేరకు విజయ ఫుల్ క్రీమ్, గోల్డ్ పాల ధర లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ ప్రకటించింది. నవంబర్ 1 నుంచి నూతన ధరలు అమల్లోకి వస్తాయని కృష్ణా మిల్క్ యూనియన్ పేర్కొంది. ప్రస్తుతం విజయ ఫుల్ క్రీమ్ అర లీటర్ ప్యాకెట్ ధర రూ.34 ఉండగా…
కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ అందించింది. తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ డెయిరీ సంస్థ పాల ధరలను పెంచింది. లీటరు పాలపై రూ.2 పెంచింది. అటు హోల్ మిల్క్ లీటరుకు రూ.4 పెంచుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ప్రకటించింది. ఈరోజు నుంచే కొత్త ధరలు అమలులోకి వస్తాయని చెప్పింది. Read Also: హైదరాబాద్‌లో అందుబాటులోకి కోవిడ్ మాత్రలు మరోవైపు…