కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ అందించింది. తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ డెయిరీ సంస్థ పాల ధరలను పెంచింది. లీటరు పాలపై రూ.2 పెంచింది. అటు హోల్ మిల్క్ లీటరుకు రూ.4 పెంచుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ప్రకటించింది. ఈరోజు నుంచే కొత్త ధరలు అమలులోకి వస్తాయని చెప్పింది.
Read Also: హైదరాబాద్‌లో అందుబాటులోకి కోవిడ్ మాత్రలు
మరోవైపు 200 మిల్లీ లీటర్ల డబుల్ టోన్డ్ మిల్క్‌పై రూ.0.50 పైసలు, 300 మిల్లీ లీటర్ల డబుల్ టోన్డ్ మిల్క్‌పై రూపాయి చొప్పున పెంచినట్లు విజయ పాల డెయిరీ సంస్థ ప్రకటించింది. అటు 500 మి.లీటర్ల డైట్ మిల్క్‌పై రూపాయి పెంచినట్లు సంస్థ తెలిపింది. కాగా అనివార్య పరిస్థితుల్లో ధరలు పెంచాల్సి వచ్చిందని… దయచేసి వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజయ డెయిరీ సంస్థ కోరింది. తెలంగాణలో విజయ పాల లీటర్ ధర రూ.47 ఉండగా.. రేపటి నుంచి రూ.49 కానుంది. ఈ పెరిగిన ధరల ద్వారా వచ్చే ఆదాయాన్ని పాల రైతులకు ఏదో ఓ రూపంలో సహాయంగా అందిస్తామని విజయ సంస్థ పేర్కొంది.