Vijay: టీవీకే అధినేత, సినీ నటుడు విజయ్‌ని ‘‘కరూర్ తొక్కిసలాట’’ గురించి ఈ రోజు(సోమవారం) సీబీఐ విచారించింది. ఆరు గంటల పాటు విచారణ జరిగింది. దీంతో ఆ తొక్కిసలాటకు తన పార్టీ బాధ్యత వహించదని సీబీఐకి చెప్పినట్లు తెలుస్తోంది.
Actor Vijay: తమిళనాడు నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వాదనలకు బలం చేకూరుస్తూ తమిళగ వెట్రి కజగం (టీవీకే) నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉన్న నేపథ్యంలో, టీవీకే జాతీయ ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం సంచలనంగా మారింది.
Karur stampede: చెన్నైతో పాటు తమిళనాడు అంతటా దీపావళి శోభ కనిపిస్తుంటే, తమిళ స్టార్‌కు విజయ్ రాజకీయ పార్టీ తమిళగ వెట్రీ కజగం (టీవీకే) ప్రధాన కార్యాలయం నిర్మానుష్యంగా కనిపించింది. ఇటీవల, విజయ్ నిర్వహించిన కరూర్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. వీరి జ్ఞాపకార్థం ఈ సంవత్సరం దీపావళి జరుపుకోవద్దని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనంద్ కేడర్లు అందరితో పాటు జిల్లా కార్యదర్శులను ఆదేశించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీవీకే కార్యాలయాల్లో చీకటి…
Vijay: తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకలో ఉన్న తమిళ సమస్యల్ని లెవనెత్తారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్‌టిటిఇ) దివంగత చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్‌ను ప్రశంసించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన సూత్రధారి అయిన, ప్రభాకరన్‌పై ప్రశంసించడం సంచలనంగా మారింది. దేశ ప్రజలు శ్రీలంక తమిళుల గొంతుక కావాలని పిలుపునిచ్చారు.
కోలీవుడ్ స్టార్ హీరో ‘దళపతి’ విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని స్థాపించారు. అక్టోబరు 27న విక్రవండిలో మొదటి బహిరంగ సభ నిర్వహించగా.. పది లక్షల మందికియా పైగా హాజరయ్యారు. అభిమానుల సందడి అయితే మరో లెవల్లో ఉంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి టీవీకే పోటీ చేస్తుందని బహిరంగ సభలో విజయ్ ప్రకటించారు. విజయ్ పొలిటికల్…
TVK will not support any party in By-Election: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని విజయ్ ముందే చెప్పారు. తమిళనాడులో జరగబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని దళపతి పేర్కొన్నారు. ఇదే విషయాన్ని టీవీకే మరోసారి స్పష్టం చేసింది. తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఏ…