Karur Stampede: కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 10 మంది పిల్లలు సహా 40 మంది మృతి చెందారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌ను ఆశ్రయిస్తామని నటుడు-రాజకీయ నాయకుడు విజయ్‌కు చెందిన తమిళగ వెట్రీ కజగం (టీవీకే) ఆదివారం తెలిపింది. ఈ విషాదం ప్రమాదవశాత్తు జరిగినది కాదని, కుట్ర ఫలితమని ఆ పార్టీ ఆరోపించింది.
Karur Stampede at Vijay’s TVK Rally: తమిళనాడులోని కరూర్‌లో నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ పార్టీ టీవీకే ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 16 మంది మహిళలు, 10 మంది పిల్లలు సైతం ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం వివిధ ఆసుపత్రుల్లో చేర్చారు. ఇంతలో తొక్కిసలాట గురించి ముఖ్యమైన సమాచారం వెలువడుతోంది. ర్యాలీలో జనం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నారని తెలిసింది. విజయ్ షెడ్యూల్ చేసిన సమయం కంటే…
Actor Vijay: టీవీకే అధినేత, స్టార్ యాక్టర్ విజయ్, నిన్న తమిళనాడు కరూర్‌లో నిర్వహించిన ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది. తొక్కిసలాట జరిగి 40 మంది మరణించారు. 100 మంది వరకు గాయపడ్డారు. అయితే, ఈ ఘటన వెనక డీఎంకే కుట్ర ఉందని టీవీకే పార్టీ ఆరోపించింది. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ విజయ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్ని టీవీకే న్యాయవాది అరివాజగన్ తెలిపారు. కరూర్ ర్యాలీలో భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించామని…
Tamil nadu: తమిళ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుంది. కరూర్‌లో ఈరోజు విజయ్ నిర్వహించిన ర్యాలీకి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగింది. మొత్తం 10 మంది మరణించారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.