రీమేక్ కథలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. కానీ, ‘జననాయకన్’ (JanaNayagan) విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాస్త విడ్డూరమైన పరిస్థితి నెలకొందనిపిస్తోంది. ఒక తెలుగు సినిమాను తమిళంలోకి రీమేక్ చేసి, తిరిగి అదే సినిమాను డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజానికి ఇలా జరగడం మొదటి సారి కాదు కానీ ఇప్పుడు ఈ సినిమా విషయంలో మరోమారు ఈ చర్చ…
2025 సంక్రాంతి కోలీవుడ్‌లో థియేటర్లలో పెద్ద సినిమాలేమీ రాలేదు. శంకర్- రామ్ చరణ్ కాంబోలో వచ్చిన గేమ్ ఛేంజరే ఒక్కటే చెప్పుకోదగ్గ ఫిల్మ్. దీనికి రీజన్ అజిత్. విదాముయర్చిని జనవరి 10న ఎనౌన్స్ చేయగా.. కొన్ని ఆటైంకి తీసుకురావాలనుకున్న చిత్రాలు ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నాయి. కానీ కాపీ రైట్స్ ఇష్యూ వల్ల విదాముయర్చి చివరి నిమిషంలో తప్పుకుంది. దీంతో సంక్రాంతికి సందడి మిస్సైంది. అజిత్ ఇలా రేసు నుండి క్విట్ అయ్యాడో లేదో.. సడెన్లీ వచ్చేశాడు విశాల్.…