భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక నేడు జరగనుంది. ఎన్డీయే కూటమి తరఫున పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌కర్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి, గవర్నర్ మార్గరెట్ అల్వా బరిలో ఉన్నారు. ఈ ఎన్నికకు సంబంధించి పోలింగ్ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు పార్లమెంట్ భవనంలో కొనసాగనుంది.
తెలంగాణ రాష్ట్ర సమితి కీలక నిర్ణయం తీసుకుంది. విపక్ష పార్టీల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర రావు నిర్ణయం తీసుకున్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీయే అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్ నామినేషన్ దాఖలు చేశారు. శనివారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎన్డీయే కూటమి తరఫున అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్‌ను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన విషయం తెలిసిందే.
విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా ఈ నెల 19న ఉదయం 11 గంటలకు నామినేషన్ వేయనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తమ అభ్యర్థిని ప్రకటించిన మరుసటి రోజే ప్రతిపక్షాలు కూడా అభ్యర్థిని ప్రకటించాయి.