ప్రజంట్ అన్ని ఇండస్ట్రీలతో పోలిస్తే మన భారతీయ చిత్ర పరిశ్రమ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. వరుస పాన్ ఇండియా చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్‌లు అందుకుంటా..వసుల పరంగా దూసుకుపోతున్నాయి. అయితే ఇటీవల అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి మృతి చెందిన విషయం తెలిసిందే. రీసెంట్‌గా కృష్ణవేణి సంస్మరణ సభ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు భారతీయ చలన చిత్రాల్లో హీరోల పాత్రల…
సభ గౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాలని సభ్యులకు సూచించడంతో పాటు తన అనుభవాలను పంచుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రాజ్యసభలో ఆయన భావోద్వేగ ప్రసంగం చేశారు. తన పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్ హోదాలో చివరి ప్రసంగం చేశారు.
భారత స్వాతంత్య్ర సంగ్రామం, తదనంతరం జాతి నిర్మాణంలోనూ మువ్వన్నెల జాతీయ పతాకం పోషించిన పాత్ర స్ఫూర్తిదాయకమని గౌరవ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో ఎర్రకోట ప్రాంగణం నుంచి తిరంగా బైక్ ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో నేడు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. కాగా.. శ్రీమతి సుశీలానారాయణరెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో నేడు రవీంద్రభారతిలో జరిగే ‘జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా.సి.నారాయణరెడ్డి’ జయంతి ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో.. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి రవీంద్రభారతి వరకు, కార్యక్రమం ముగిసిన తర్వాత రవీంద్రభారతి నుంచి జూబ్లీహిల్స్ వరకు ట్రాఫిక్ ఆంక్షాలు ఉంటాయని అధికారులు తెలిపారు. read also: Tragedy in Medak:…
త్వరలోనే రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పేరు దాదాపు ఖరారైనట్టుగా ప్రచారం సాగుతోంది..
సోషల్ మీడియాలో రోజురోజుకీ కేటుగాళ్లు పెరిగిపోతున్నారు.. ఫేస్‌బుక్ సహా వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో ఫేక్ ఐడీలు సృష్టించి డబ్బులు వసూలు చేస్తున్నారు.. తను కష్టాల్లో ఉన్నాను.. ఆర్థిక సాయం చేయండి అంటూ మెసేజ్‌లు పెట్టి.. తప్పుడు నెంబర్లతో గుల్ల చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అలా డబ్బులు ఇచ్చి ఎంతో మందా మోసపోయారు.. అయితే, ప్రముఖులను సైతం వదలడంలేదు కేటుగాళ్లు.. ఏకంగా భారత ఉపరాష్ట్రపతి పేరుతో ఫేక్ మేసేజ్‌లు పెడుతున్నారు.. Read Also: Ramzan…
సీనియర్ నటుడు, దర్శక, నిర్మాత, కథకుడు బాలయ్య మృతికి దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. ”ప్రముఖ తెలుగు సినిమా నటుడు శ్రీ బాలయ్య గారు పరమపదించారని తెలిసి విచారించాను. ఉన్నత సంప్రదాయాలను పాటిస్తూ ఉత్తమ నటుడిగా పేరు సంపాదించుకున్న మంచి మనిషి ఆయన. శ్రీ బాలయ్య గారు నటుడిగానే గాక నిర్మాతగా, దర్శకునిగా అనేక మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి…
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ మహోత్సవాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరికి తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. మనదేశంలో పూర్వ కాలం నుంచి సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయని, ఎంతో మంది పోరాడితే మనం స్వేచ్ఛగా ఉన్నామని, ఏ ఒక్క వ్యక్తి, ఏ ఒక్క వర్గం వల్లకాదు ఎందరో పోరాడితే మనకు స్వాతంత్రం వచ్చిందని ఆయన…
హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆధ్వర్యంలో భారత స్వాతంత్య్ర అమృత మహోత్సవాల్లో భాగంగా మరుమాముల దత్తాత్రేయ శర్మ రచించిన ‘ముట్నూరి కృష్ణారావు గారి సంపాదకీయాలు’ గ్రంథావిష్కరణ సభలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి రచన టెలివిజన్ సంస్థల అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి కూడా విశిష్ట అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరిని శాలువ కప్పి సన్మానించారు.
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వార్తా పత్రికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పత్రిక లేని ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని చూడలేమని వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు సొంత పత్రికలు పెట్టుకుంటున్నాయన్నారు. కొన్ని పార్టీలు సొంత పత్రికలో సొంత బాకా ఊదుకుంటున్నాయని ఆయన విమర్శించారు. అంతేకాకుండా ఒక పత్రికలో ఉన్నది మరో పత్రికలో ఉండదని, సమాజానికి హాని చేసే పత్రికలు వద్దంటూ ఆయన హితవు పలికారు. ఇప్పుడు కొన్ని పత్రికలు సెన్సేషన్ కాదు.. సెన్స్…