భారతీయ చిత్రసీమలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. భారతీయ సినిమా రంగానికి ఎనలేని సేవలు చేసినవారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేస్తారు. ఈ అవార్డు ప్రకటించిన ప్రతీసారి విమర్శలు కూడా అదే తీరున వినిపిస్తూ ఉంటాయి. 2019 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అందించారు. అక్టోబర్ 25న జరిగిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎమ్.వెంకయ్య నాయుడు చేతుల మీదుగా రజనీకాంత్ ఈ అవార్డును…
నేడు దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ సినిమా పురస్కారాల వేడుక జరగనుంది. ఈ 67 వ జాతీయ సినిమా పురస్కారాల వేడుకలో రజినీకాంత్ వంటి పలువురు ప్రముఖులు అవార్డులు అందుకోనున్నారు. వాస్తవానికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ఈ ఏడాది మార్చి లోనే ప్రకటించారు. అప్పట్లోనే అవార్డుల ప్రదానోత్సవం జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈరోజు జాతీయ పురస్కారాల ప్రదానోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై, అవార్డులను అందజేయనున్నారు. ఇందులో భాగంగానే సూపర్ స్టార్…
అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా… పార్లమెంట్ ప్రత్యక్ష ప్రసారాల కోసం కొత్త ఛానల్‌ను ప్రారంభించింది కేంద్రం. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభా స్పకీర్ ఓం బిర్లా, ప్రధాని మోడీ… సంసద్ టీవీని ప్రారంభించారు. ఇప్పటి వరకు లోక్‌సభ, రాజ్యసభ పేర్లతో రెండు ఛానల్స్ ఉండేవి. ఆ రెండింటినీ సంసద్ ఛానల్‌లో విలీనం చేశారు. దేశ పార్లమెంట్ వ్యవస్థలో సంసద్ టీవీ…ముఖ్యమైన చాప్టర్‌గా మిగిలిపోతుందన్నారు ప్రధాని మోడీ. పార్లమెంటు కార్యకలాపాలను విస్తృతస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా సంసద్…
ఢిల్లీలో పర్యటనలో ఉన్న శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి.. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయును కలిశారు.. 2022 ఫిబ్రవరిలో జరగనున్న సమతా ప్రతిమ (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు.. మొదట ఉపరాష్ట్రపతిని కలిసిన ఆహ్వానం పలకగా.. వివక్షలను నిర్మూలించి సమానత్వ సాధన కోసం భగవద్రామానుజులు కృషి చేశారని.. అతిపెద్ద ప్రతిమ ఏర్పాటు… ప్రపంచానికి రామానుజుని బోధనలు, సందేశం విస్తరించేందుకు తోడ్పడుతుందని ఆకాక్షించారు వెంకయ్య.. సమాజంలో అంటరానితనాన్ని, వివక్షను…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీమణి ఉషా మరియు కుమార్తె దీపా వెంకట్ బెంగుళూరు దేవనహళ్లిలో సదహళ్లి గేట్ వద్ద మొక్కలు నాటారు. అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి సుధీర్ వారికీ వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్బుతమని ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటాలని వారు ఆకాక్షించారు. అడవులు, చెట్ల గొప్పతనాన్ని తెలియజేసెలా వృక్షవేదం పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. ఇంత మంచి…
నేడు విశాఖపట్నంకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రానున్నారు. ఉదయం 11.45కు ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకోనున్నారు. విమానాశ్రయంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో పాటుగా తూర్పు నౌకాదళాధిపతి, కలెక్టర్, సీపీ, ఎస్సీ, తదితర అధికారులతో పాటు మేయరు, జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగత కార్యక్రమంలో పాల్గొననున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన విశాఖలోనే బస చేయనున్నారు. 29న ఉదయం 11.30 గంటలకు తిరుగు ప్రయాణమవుతారని అధికారిక ప్రకటనలో తెలిపారు.
నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య మందుపై పరిశోధన పురోగతి గురించి ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆరా తీశారు. ఈ ఉదయం కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు ఫోన్ చేశారు. పరిశోధన పురోగతి గురించి గౌరవ ఉపరాష్ట్రపతికి వివరించిన కేంద్ర మంత్రి, భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రాలయ పరిధిలో ఉన్న సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్) ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ఆయుష్ విభాగం వారి సహకారంతో ఆనందయ్య మందును ఇప్పటికే…
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.. మొదట కృష్ణపట్నంతో ప్రారంభమైన కరోనా ఆయుర్వేద మందు పంపిణీ.. క్రమంగా నెల్లూరు జిల్లా.. పక్క జిల్లాలు.. పక్కా రాష్ట్రాలు.. ఇలా క్రమంగా కరోనా బాధితులు కృష్ణపట్నం బాటపట్టారు.. రోగుల తాకిడి ఎక్కువ కావడంతో.. మందు పంపిణీ కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి విచ్చింది.. అయితే, ఈ వ్యవహారంపై ఆరా తీశారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఆయుష్ ఇన్ ఛార్జ్ మంత్రి, ఐసిఎంఆర్ డైరక్టర్ జనరల్ తో మాట్లాడారు వెంకయ్య..…