Vice President Election 2025: ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే మంగళవారం నిర్వహించనున్న ఎన్నిక సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు సమాచారం. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆకస్మిక రాజీనామాతో ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి స్థానానికి ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్న విషయం తెలిసిందే. మీకు తెలుసా.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో రహస్య ఓటింగ్ విధానాన్ని అనుసరిస్తారు. రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో కూడుకున్న…
ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ, వైసీపీ, జనసేన, బీఆర్ఎస్ ఎంపీలు.. తెలుగు వ్యక్తి, యూపీఏ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
భారతదేశ ఉపరాష్ట్రపతి పదవి కోసం సెప్టెంబర్ 9 అంటె రేపు ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి లు ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. వెనువెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు వెల్లడించనున్నారు. “ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్”గా వ్యవహరించనున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పి.సి. మోడి. “ఎన్నికల…
భారతదేశ 17వ ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం సెప్టెంబర్ 9న పోలింగ్ జరగనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డిలు పోటీలో ఉన్నారు. ఎన్నిక గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే బిజెపి తమ పార్టీ ఎంపీలతో పాటు, ఎన్డీఏ ఎంపీలకు వర్క్ షాప్ నిర్వహిస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ విధానంపై మాక్ ట్రైనింగ్ జరుగుతోంది. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తనకు ఓటెయ్యాలంటూ ఇప్పటికే…
డిల్లీ - భారతదేశ ఉపరాష్ట్రపతి పదవి కోసం సెప్టెంబర్ 9 ఎన్నిక జరగనుంది. ఎన్డిఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి లు ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతున్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఉభయ సభల్లో ఉన్న సభ్యుల్లో మెజారిటీ మెంబర్లు ఎన్డీఏ కూటమి వైపే ఉన్నారు.
ఎన్డీఏ తరఫున ఉప రాష్ట్రపతి బీజేపీ సీపీ రాధకృష్ణన్ ఉప రాష్ట్రపతి అభ్యర్దిగా బరిలో నిలవటంతో మద్దతుగా నిలిచింది వైసీపీ.. మొత్తంమీద మరోసారి తమకు బీజేపీతో స్నేహ సంభందాన్ని గుర్తుకు తెచ్చినట్లేనని ఆ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.